Friday, April 26, 2024
- Advertisement -

ఆచార్య చిత్రంలో శ్రీశ్రీ కవితలు..!

- Advertisement -

మహాకవి శ్రీశ్రీ ఆ పేరు ఉంటేనే ఓ ఉద్వేగం.. ఓ సంచలనం. ఆయన రచించిన మహాప్రస్థానం గురించి తెలియని తెలుగువారు ఉండరేమో. ఈ యుగం నాది ప్రకటించుకొన్న గొప్ప కవి శ్రీశ్రీ. అయితే శ్రీశ్రీ ఎన్నో సినిమా పాటలు కూడా రాశారు. ఆయన మరణానంతరం కూడా ఆయన కవిత్వంలోని పదాలను తెలుగు సినిమాల్లో ఎన్నో సందర్భాల్లో వాడుకున్నారు. ఇప్పటికీ చాలా మంది శ్రీశ్రీ కవిత్వాన్ని ఉటంకిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మెగాస్టార్​ చిరంజీవి .. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

కొరటాల చిత్రాల్లో కమర్షియల్​ అంశాలు ఉన్నప్పటికీ.. సామాజిక అంశాలను కూడా ఆయన టచ్​ చేస్తూ ఉంటారు. ప్రతి సినిమాలోనూ ఓ సామాజిక సందేశం ఉంటుంది. ఆచార్య చిత్రంలో మెగాస్టార్​ చిరంజీవి నక్సలైట్​గా, దేవాదాయ శాఖ ఉద్యోగిగా కనిపించబోతున్నట్టు టాక్​. ఈ క్రమంలో మహాప్రస్థానంలోని కొన్ని పంక్తులను ఈ సినిమాలో వాడుకోబోతున్నట్టు సమాచారం.

అయితే ఏ కవితను వాడబోతున్నారు.. మాటల రూపంలో వాడతారా? పాటల రూపంలో వాడతారా? అన్న విషయంపై క్లారిటీ లేదు. శ్రీశ్రీని మెగాస్టార్​ చిరంజీవి కూడా ఎంతో అభిమానిస్తారు. రుద్రవీణ, ఠాగూర్​ చిత్రాల్లో శ్రీశ్రీ కవితలను వాడుకున్నారు. ఇక ఠాగూర్​లో నేను సైతం ప్రపంచాగ్నికి అనే లైన్​ వాడుకున్నారు. ఈ పాటకు జాతీయ అవార్డు కూడా దక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆచార్యలో ఏ కవిత వాడుకుంటారో వేచి చూడాలి.

Also Read

లైగర్​ మార్కెట్​ .. ఈ రేంజ్​లోనా..!

హరీశ్​ శంకర్​ – పవర్​స్టార్​ సినిమా ఎలా ఉండబోతుందంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -