హరీశ్​ శంకర్​ – పవర్​స్టార్​ సినిమా ఎలా ఉండబోతుందంటే?

- Advertisement -

రాజకీయాలకు తాత్కాలిక బ్రేక్​ ఇచ్చిన పవన్​ కల్యాణ్​ వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఆయన నటించిన వకీల్​సాబ్​ హిట్​ అయ్యింది. ప్రస్తుతం క్రిష్ తో చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు, మరో మలయాళ రీమేక్​ అయ్యప్పనుమ్ కోషియమ్ లోనూ పవర్​ స్టార్​ పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు.

వీటితో పాటు హరీశ్​ శంకర్​ డైరెక్షన్ లో పవన్ 28వ చిత్రంలో పవన్​ నటించబోతున్నాడు. ఈ సినిమాను మాస్ ఎంటర్ టైనర్ గా హరీష్ శంకర్ మలచనున్నారట. జూలై మూడో వారం నుంచి ఈ మూవీ సెట్స్​పైకి రానున్నట్టు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన గబ్బర్​ సింగ్ భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -

అయితే ఈ సినిమాలో పవన్​ రెండు విభిన్న పాత్రల్లో పవన్​ కనిపిస్తాడట. ఇందులో ఓ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటుందని అందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. గబ్బర్​ సింగ్​ తర్వాత హరీశ్​ శంకర్​ గద్దలకొండ గణేశ్​, దువ్వాడ జగన్నాథమ్​ వంటి సినిమాలను తెరకెక్కించాడు. హరీశ్​ శంకర్​ దర్శకుడే కాక.. గొప్ప రచయిత కూడా. అందుకే ఆయన సినిమాల్లో మాస్​ను అలరించే డైలాగులు ఉంటాయి. గతంలో భారీ హిట్​ ఇవ్వడంతో పవర్​ స్టార్​ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కు మరోసారి చాన్స్​ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ సారి కూడా గబ్బర్ సింగ్ లా ఓ మాస్​ చిత్రం పడుతుందని పవర్​ స్టార్​ ఫ్యాన్స్​ ఎదురుచూస్తున్నారు.

Also Read

మరోసారి నితిన్ తో జతకట్టనున్న రష్మిక..!

జెర్సీ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -