Friday, April 26, 2024
- Advertisement -

కోవాగ్జిన్​ భేష్… ప్రభావశీలత 77.8

- Advertisement -

కరోనా నివారణకు మన మందున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్​. అయితే వ్యాక్సిన్​ ల తయారీ, పనితీరు, భద్రతపై తొలి నుంచి అనేక అనుమానాలు నెలకొన్నాయి. వ్యాక్సిన్లు హడావుడిగా తయారుచేశారని.. ఏళ్లకు ఏళ్లు పరిశోధించి బయటకు తీసుకురావాల్సిన వ్యాక్సిన్లను కేవలం సంవత్సరం లోపే మార్కెట్​లోకి తీసుకొచ్చారని కొందరు నిపుణులు అంచనా వేశారు. మనదేశంలోనూ భారత్​ బయోటెక్​ తయారుచేసిన కోవాక్జిన్​, ఆక్స్​ఫర్డ్​ సహకారంతో సీరం ఇన్​స్టిట్యూట్​ తయారుచేసిన కోవిషీల్డ్​ అందుబాటులోకి వచ్చాయి.

అయితే తొలుత ఈ వ్యాక్సిన్​లు వేయించుకొనేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ కరోనా సెకండ్ వేవ్​ అనంతరం ప్రస్తుతం వ్యాక్సిన్​ల కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే కోవాక్జిన్​ పనితీరుపై మొదటి నుంచి కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. ఈ వ్యాక్సిన్​కు మూడో దశ ట్రయల్స్​ పూర్తికాకపోవడం.. డబ్ల్యూహెచ్​వో నుంచి గుర్తింపు రాకపోవడంతో దీని పనితీరుపై అనుమానాలు నెలకొన్నాయి. అయినా కోవాక్జిన్​ పంపిణీ మాత్రం కొనసాగుతోంది.

తాజాగా ఈ వ్యాక్సిన్​ కు సంబంధించిన ఓ సానుకూల అంశం బయటకు వచ్చింది. కోవాక్జిన్​ టీకా కరోనాపై 77.8 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని నిపుణుల కమిటీ తేల్చినట్టు సమాచారం. ఈ వ్యాక్సిన్​ మూడో దశ ట్రయల్స్​కు సంబంధించిన ఫలితాలను డీసీజీఐకి చెందిన ఎక్స్​పర్ట్​ కమిటీకి సమర్పించింది. అయితే మూడో దశ ప్రయోగాల్లో కోవాగ్జిన్​ సామర్థ్యం 77.8 శాతంగా తేలిందని తెలుస్తోంది.

Also Read

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. 27 మందికి కోవిషీల్డ్ కు బదులుగా కోవాక్సిన్..!

థర్డ్​వేవ్​తో పిల్లలకు ప్రమాదం లేదు..! మరో అధ్యయనం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -