కమల్‌హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
తమిళంలో శ్రీదేవితో కమల్‌హాసన్ ఎక్కువ సినిమాలు చేశాడు. వారిద్దరు నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై ఘన విజయం పొందాయి. అయితే శ్రీదేవి మృతితో తమిళ అగ్ర నటుడు కమల్‌హాసన్‌పై పలు విమర్శలు, రూమర్లు వస్తున్నాయి. దానికి విరణ ఇచ్చుకున్నట్టుగా కమల్ ట్వీట్టర్‌లో పలు వ్యాఖ్యలు చేశారు.
తనకు హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీదేవి అకాల మృతిపై కమల్ బాధపడ్డారు. అయితే వీరిద్దరి అనుబంధంపై రకరకాల రూమర్స్ తమిళనాట ప్రచారంలో ఉండడంతో తమిళ మ్యాగజైన్ ఆనందవికటన్ కమల్‌ని ప్రశ్నించగా సమాధానాలు ఇచ్చారు. సినిమాలో ఎలా కనిపిస్తే నిజ జీవితంలోనూ అలాగే ముడిపెడతారని చెప్పారు. నిజ జీవితాల్లోనూ కూడా అలాగే ఉంటామనుకునేవారు. మా ఇద్దరి పెయిర్ సూపర్ హిట్ కావడంతో జనం అలా మాట్లాడుకుని ఉండవచ్చు.
నిజానికి శ్రీదేవి నాకు చెల్లెలు లాంటిది. నేను కూడా శ్రీదేవితో కలిసి ఆమె తల్లి చేతి ముద్దలు తిన్నా. నాకు శ్రీదేవి తోబుట్టువుతో సమానం.. దయచేసి వదంతులను సృష్టించవద్దు అని కోరారు. శ్రీదేవి యువతిగా ఉన్న దశ నుంచి అద్భుతమైన (పరిపూర్ణ) మహిళగా మారిపోయిన దశ వరకు ఆమె జీవితానికి నేను ఓ సాక్ష్యంలా నిలిచా. ఆమె తనకు దక్కిన స్టార్ డమ్‌కు అన్ని విధాలా అర్హురాలు.
తను పరిచయం అయినప్పటి నుంచి చివరగా మేమిద్దరం ఎదురుపడిన సందర్భం వరకు ఎన్నో జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయని చెప్పారు. ఇప్పుడైతే ‘సద్మా’ (వసంత కోకిల)లోని లాలి పాట వెంటాడుతోంది. మనమంతా శ్రీదేవిని మిస్ అయ్యాం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.