Friday, April 19, 2024
- Advertisement -

చిరంజీవి తల్లికి శ్రీరెడ్డి క్షమాపణలు

- Advertisement -

తెలుగులో కాస్టింగ్ కౌచ్ వివాదంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు శ్రీరెడ్డి. అనంతరం ‘మా’సభ్యత్వం విషయంలోనూ తనకు అన్యాయం జరిగిందని అర్థనగ్నంగా నిరసనకు దిగి మరింత ఫేమస్ గా మారారు. అనంతరం ఒక్కొక్క ప్రముఖ హీరో, నిర్మాతలు, దర్శకుల గురించి వెల్లడించిన పలు విషయాలు సంచలనంగా మారాయి.

కాస్టింగ్ కౌచ్ ను మరింత ప్రాచుర్యం లోకి తీసుకువచ్చారు. ఈ సమయంలో ఆమెకు మహిళా సంఘాలు, ప్రముఖులు సైతం మద్దతు తెలిపారు . ఈ క్రమంలో శ్రీరెడ్డి చిరంజీవి తల్లిపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో శ్రీరెడ్డిపై మెగాస్గార్, పవర్ స్టార్ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత శ్రీరెడ్డి తమిళనాడుకు వెళ్లారు.

కాగా ఇన్నాళ్లకు శ్రీరెడ్డి తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదని అన్నారు. తను మరింత ఫేమస్ కావాలంటే అలా మాట్లాడమని కొందరి చెప్పుడు మాటలు విని అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. ఇప్పటికైనా తన తప్పును దిద్దుకోవాలని అనుకుంటున్నట్టు పశ్చాత్తాపం చెందారు. ఇందులో భాగంగా అంజనా దేవికి యసోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారు.

Also Read: పుష్ప సినిమాతో ప్రేరణ పొంది.. యువకుడిని చంపేశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -