పుష్ప సినిమాతో ప్రేరణ పొంది.. యువకుడిని చంపేశారు

- Advertisement -

సోషల్ మీడియా, సినిమాల ప్రభావం యువతపై ఎంత దుష్ప్రభావం చూపుతున్నదో తెలిపే ఘటన ఇది. సినిమాలు, వెబ్ సిరీస్ లను ప్రేరణగా తీసుకున్న ముగ్గురు మైనర్ బాలలు ఒక యువకుడిని హతమార్చారు. ఈఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఓ బస్తీలో నివాసముంటున్న ముగ్గురు బాలలు.. సోషల్ మీడియాలో పాపులర్ కావాలని ప్రయత్నిస్తున్నారు. తమ గ్యాంగ్ కు బద్నాం అనే పేరును కూడా పెట్టుకున్నారు. తమను చూసి ఇతరులు భయపడేలా ఏదైనా చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం తము నివాసం ఉంటున్న జహంగీర్‌పురికి చెందిన శింబును ఎంచుకున్నారు. కొద్దికాలంగా అతడిని టార్గెట్ చేసి వెంబడిస్తు వచ్చారు. ఒంటరిగా ఉన్నది చూసి శింబుపై దాడి చేశారు. కాగా చికిత్స పొందుతూ శింబు చనిపోయాడు.

- Advertisement -

పొలీసుల విచారణలో పలు విషయాలను నిందితులు వెల్లడించారు. తాము దాడి చేసిన దృశ్యాలను వీడియో రికార్డు చేసి సోషల్ మీడియా (ఇన్ స్టాగ్రామ్) లో పోస్ట్ చేసి పాపులారిటీ సంపాదించి ఫేమస్ కావాలని ప్లాన్ వేసుకున్నామని చెప్పారు. పుష్ప సినిమాను, బౌకాల్ అనే హిందీ వెచ్ సీరిస్ ప్రేరణగా తీసుకున్నామని చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను జువైనల్ హోంకు తరలించారు.

Also Read: వరుణ్ తేజ్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -