తెలంగాణ సీఎస్, డీజీలకు తాఖీదులు

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలపై లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే తమ ముందుకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం వీరు చెప్పబోయే సమాధానంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

317 జీవోను వ్యతిరేకిస్తూ బండి సంజయ్ కరీంనగర్లోని తన ఎంపీ కార్యాలయంలో కోవిడ్ నిబంధలను పాటిస్తూ దీక్ష చేయాలని నిర్ణయించారు. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఎంపీ కార్యాలయంలోకి వెళ్లి సంజయ్ ను అరెస్ట్ చేశారు. ఈఘటనలో పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని, తన కార్యాలయం డోర్ ను పగులగొట్టి తనను అక్రమంగా అరెస్ట్ చేశారని సంజయ్ పార్లమెంట్ కమిటీకి ఫిర్యాదు చేశారు.

- Advertisement -

ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సంజయ్ కమిటీకి సమర్ఫించారు. దీనిపై విచారణ చేసిన కమిటీ తెలంగాణ సీఎస్, డీజీపీలతో పాటు హోం శాఖ ముఖ్య కార్యదర్శి , కరీంనగర్ పోలీసు కమిషనర్, హుజూరాబాద్ ఏసీపీ స్థానిక సీఐ, ఎస్ఐలకు సమన్లు జారీ చేసింది.

Also Read: కత్రినా కావాలా? కరీనా కావాలా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -