బింబిసార సిక్వల్ లో రాంచరణ్..ఫ్యాన్స్ కు పండగే?

Ram Charan Next Movie With Bimbisara Director Vasista
Ram Charan Next Movie With Bimbisara Director Vasista

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ” RC15 ” చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నా ఈ మూవీలో చరణ్ ను డిఫరెంట్ రోల్ లో చూపిస్తున్నాడట డైరెక్టర్ శంకర్. సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో చరణ్ మూడు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సంగతి అలా ఉంచితే చరణ్ తరువాతి మూవీ ఎంటనేది ఇప్పటికీ కూడా బిలియన్ డాలర్ క్వశ్చన్ గా ఉంది.

ఆ మద్య జర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో మూవీ వుందబోతుందని గట్టిగా వార్తలు వచ్చినప్పటికి, ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతం హోల్డ్ లో పడినట్లు సమాచారం. ఇక చరణ్ డైరెక్టర్స్ లిస్ట్ లో మహేశ్ బాబు డైరెక్టర్ పరశురామ్, కన్నడ దర్శకుడు నార్థన్, వంటి వారి పేర్లు కూడా గట్టిగానే వినిపించాయి. ఇక ప్రస్తుతం మరో క్రేజీ యుంగ్ డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల వచ్చిన ” బింబిసార ” మూవీతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ట. చరణ్ కోసం ఓ స్క్రిప్ట్ సిద్దం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే చరణ్ తో కథ చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. అయితే దర్శకుడు వశిష్ట ” బింబిసార ” మూవీకి మూడు నుంచి నాలుగు భాగాలు సిక్వల్స్ ఉంటుందని గతంలోనే తెలిపారు. ఇప్పటికే బింబిసార పార్ట్ 2 కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నాయట. అయితే రాంచరణ్ తో తీయబోయే మూవీ కూడా బింబిసార సిరీస్ లోని భాగమేనంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికి ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం ఈ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఒకవేళ బింబిసార సిక్వల్ లో రాంచరణ్ ఉంటే ఆ సిరీస్ కు నేషనల్ లెవల్ క్రేజ్ ఏర్పడడం ఖాయం.

ఇవి కూడా చదవండి

బాలయ్య మరో సైంటిఫిక్ ప్రయోగం.. నిజమేనా ?

వాల్తేరు వీరయ్య కోసం క్యూ కడుతున్న స్టార్ హీరోలు !

ఇంటర్వ్యూ లో కన్నీరు పెట్టిన సమంత.. కారణం అదే !