Wednesday, May 15, 2024
- Advertisement -

మహేశ్ కంటే ముందే.. అల్లు అర్జున్ సూపర్ ప్లాన్ ?

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డమ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఉంది. పుష్ప మొదటి భాగంతో సూపర్ హిట్ గా నిలవడంతో పాటు రిలీజ్ అయిన అన్నీ భాషల్లో అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా హిందీలో పుష్ప రాజ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అక్కడి స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని వసూళ్లను బన్నీ ” పుష్ప ” మూవీతో రాబట్టాడు. దాంతో పుష్ప పార్ట్ 2 పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. .

అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే కథ మరింత మెరుగులు దిద్దినట్లుగా తెలుస్తోంది. ఇక పుష్ప పార్ట్ 1 తో ఒక్క పాన్ ఇండియా స్థాయిలోనే సంచలనం క్రియేట్ చేసిన బన్నీ.. పుష్ప రెండవ భాగంతో ఏకంగా పాన్ వరల్డ్ పైనే గురి పెట్టినట్లుగా తెలుస్తోంది. పుష్ప రెండవ భాగంను ఏకంగా 13 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారట మేకర్స్. అందుకు తగ్గట్లుగానే హాలీవుడ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. ఇదిలా ఉంచితే దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీని పాన్ వరల్డ్ చిత్రంగా రూపొందిస్తున్నట్లు రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు రాజమౌళి బాటలోనే బన్నీ కూడా తన సినిమాను పాన్ వరల్డ్ గా ప్లాన్ చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే రాజమౌళి మూవీ కంటే ముందే బన్నీ మూవీనే ముందు రిలీజ్ కావడం పక్కా. కాబట్టి అల్లు అర్జున్ మూవీనే ముందు పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ అయ్యే అవకాశం ఉండడంతో.. తెలుగు నుంచి రిలీజ్ అయ్యే మొట్టమొదటి పాన్ వరల్డ్ మూవీ గా ” పుష్ప ” నిలిచే అవకాశం ఉంది. మరి ” పుష్ప పార్ట్ 1 ” తో ఇండియాను షేక్ చేసిన బన్నీ.. పుష్ప పార్ట్ 2 తో వరల్డ్ ను షేక్ చేస్తాడేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

బాలయ్య మరో సైంటిఫిక్ ప్రయోగం.. నిజమేనా ?

వాల్తేరు వీరయ్య కోసం క్యూ కడుతున్న స్టార్ హీరోలు !

రాజమౌళి చేతుల్లోకి ” ఆది పురుష్ “.. నిజమేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -