Tuesday, April 30, 2024
- Advertisement -

మహేశ్ ను కందలవీరుడు గా మార్చడం.. రాజమౌళికి సాధ్యమేనా ?

- Advertisement -

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హండ్సమ్ హీరో ఎవరు అంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు అని ఎవరైనా టక్కున చెప్పేస్తారు. నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ళ కుర్రాడిలా కనిపించడం ఒక్క మహేశ్ బాబుకు మాత్రమే సాధ్యం. అలాంటి సూపర్ హండ్సమ్ హీరోతో కష్టతరమైన వర్కౌట్స్ చేయించడానికి దర్శకులు వెనుకడుగు వేస్తుంటారు. ఎందుకంటే బాడీ బిల్డింగ్ హేవిగా చేయడం వల్ల ఫేస్ లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. సహజంగానే అందంగా ఉండే మహేశ్ బాబు.. హెవీ వర్కౌట్స్ చేయడం వల్ల ఆయన ఫేస్ లోని గ్లామర్ దెబ్బ తినే అవకాశం ఉంది.

అందుకే దర్శకులు మహేశ్ బాబు తో బాడీ బిల్డింగ్ చేయించడానికి ఇష్టపడరు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఇక జక్కన్న హీరోలు ఎలా ఉంటారో మానందరికి బాగా తెలుసు. కండలు తిరిగిన దేహంతో కొండలను సైతం పిండి చేసేలా ఉంటారు. ఉదాహరణకు బాహుబలి లో ప్రభాస్ మరియు రాణా, అలాగే ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ మరియు రాంచరణ్ ఎలాంటి బాడీతో కనిపించారో మానందరికి తెలుసు.

ఇక ఇప్పుడు మహేశ్ వంతు వచ్చింది. మరి మహేశ్ ను కూడా జక్కన్న కండలు తిరిగిన దేహంతో చూపిస్తారా అంటే అవుననే చెప్పవచ్చు. కథ డిమాండ్ చేస్తే తన హీరో నుంచి ఏం రాబట్టుకోవలో దర్శకధీరుడికి బాగా తెలుసు. తాను మహేశ్ తో తీయబోయే సినిమా యాక్షన్ అడ్వంచర్ మూవీ అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. మరి యాక్షన్ అడ్వంచర్ మూవీ కావడంతో మహేశ్ ను కండలు తిరిగిన దేహంతో చూపించే అవకాశం ఉంది. మరి రాజమౌళి మహేశ్ ను అలా చూపించడంలో తగ్గేదెలే అంటారా ? లేదా అందరి దర్శకులలాగా వెనుకడుగు వేస్తారా ? అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

విక్రమ్ సిక్వల్ లో రామ్ చరణ్.. నిజమేనా ?

రౌడీ హీరోకి లైగర్ దెబ్బ.. ఖుషీ మరింత వెనక్కి ?

గజిని సిక్వల్ కోసం.. పోటీలో సూర్య, అల్లు అర్జున్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -