Thursday, May 9, 2024
- Advertisement -

వాట్సప్ ద్వారా గ్రూప్ కాల్స్ చేయండిలా !

- Advertisement -

నేటి రోజుల్లో ప్రతి మొబైల్ యూజర్ కూడా వాట్సప్ వాడడం సర్వసాధారణం. ప్రతి మొబైల్ లో కూడా ఈ యాప్ తప్పని సరిగా ఉంటుంది. ఏమైనా ఫోటోస్ గాని, మెసేజెస్ గాని ఇతరులకు పంపలంటే.. దాదాపుగా అందరూ వాట్సప్ ద్వారానే పంపిస్తూ ఉంటారు. ఇక యూజర్స్ ను ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటూ ఉంటుంది వాట్సప్ సంస్థ. ఇక వాట్సప్ యూజర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గ్రూప్ కాలింగ్ ఫీచర్ ను ఇటీవల తీసుకొచ్చింది. ఈ గ్రూప్ కాలింగ్ ఫీచర్ గూగుల్ మీట్, జూమ్ యాప్ లలో చూశాం. ఇప్పుడు అదే ఫీచర్ ను వాట్సప్ కూడ ప్రవేశపెట్టింది. ఈ గ్రూప్ కాలింగ్ ఫీచర్ ద్వారా ఆఫీస్ మీటింగ్స్ పెట్టుకోవడానికి, లేదా ఒకేసారి చాలా మంది మాట్లాడుకోవడానికి ఉపయోగ పడుతుంది. ఈ ఫీచర్ ను వాట్సప్ లో ఎలా వాడలో చూద్దాం..!

*ముందుగా మొబైల్ లోని వాట్సప్ యాప్ ను అప్డేట్ చేయాలి.
*వాట్సప్ ఓపెన్ చేసిన తరువాత కాల్స్ సెక్షన్ లోకి వెళ్ళాలి. అక్కడ మన కాల్ హిస్టరీతో పాటు పైన క్రియేట్ గ్రూప్ కాల్ లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
*దాన్ని సెలెక్ట్ చేసుకున్నా తరువాత కాల్ టైప్ వీడియో లేదా ఆడియో అని అడుగుతుంది.
*అందులో మనకు కావలసినది ఎంచుకొని, అక్కడ క్రియేట్ అయిన లింక్ ను గ్రూప్ కాల్ మాట్లాడవలసిన వారికి షేర్ చేయాలి.
*ఆ లింక్ ఓపెన్ చేసిన జాయిన్ ఆప్షన్ ఎంచుకొని గ్రూప్ కాల్ లోకి ఎంట్రీ అవ్వచ్చు.

ఇవి కూడా చదవండి

లాప్ టాప్ ఓవర్ హిట్ అవుతోందా.. అయితే ఇలా చేయండి !

ఆకలి వేయడం లేదా.. అయితే ఇలా చేయండి !

చలికాలంలో వేడి నీళ్ళతో స్నానం చేస్తే.. అంతే సంగతులు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -