Tuesday, April 30, 2024
- Advertisement -

T20 WORLDCUP 2022 : భారత్ ఓటమికి.. కోహ్లీ, రోహిత్ లే కారణం ?

- Advertisement -

ఆస్ట్రేలియాలో జరుగుతున్నా టి20 వరల్డ్ కప్ లో భారత్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. పాకిస్తాన్, నెదర్లాండ్ పై ఘనవిజయం సాధించిన భారత్ సౌతాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేసింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో భారత్ పై సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత ఓవర్లలో 133 పరుగుల స్వల్ప స్కోర్ చేసింది. సౌతాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయడంతో టీమిండియా బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ 14 బంతుల్లో 15 పరుగులు, కే‌ఎల్ రాహుల్ 9 బంతుల్లో 13 పరుగులు చేసి మరోసారి నిరాశ పరుచగా.. ఇక భీకర ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ 11 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

ఆ ధశలో క్రీజ్ లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తనదైన రీతిలో ఆడుతూ జట్టుకు గౌరవప్రధమైన స్కోర్ అందించడంలో ముఖ్యపాత్ర వహించాడు. సూర్య కుమార్ యాదవ్ 40 బంతుల్లో 68 పరుగులు చేయడంతో భారత్ 133 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచింది. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4 వికెట్లు, పర్నెల్ 3 వికెట్లు తీసి భారత్ పాతనాన్ని శాసించారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి తడబాటు కు గురైంది. ఇక ఆదిలోనే డికాక్, రోసో వంటి భీకర బ్యాట్స్ మెన్స్ ను వెంటవెంటనే ఔట్ చేశాడు అర్షదీప్ సింగ్, ఇక తరువాత కెప్టెన్ బావుమా ను కూడా షమి బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో మర్క్రమ్ 41 బంతుల్లో 52 పరుగులు, మిల్లర్ 46 బంతుల్లో 59 పరుగులు చేయడంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫలితంగా అతి కష్టం మీద భారత్ పై సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

కొంపముంచిన కోహ్లీ, రోహిత్

సౌతాఫ్రిక ముందు భారత్ 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచినప్పటికి.. భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా ఆ మాత్రం స్కోర్ చేధించడానికి విపరీతంగా తడబడింది. మొదటి ఓవర్లోనే 2 కీలక వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా .. ఒకానొక దశలో సౌతాఫ్రికా గెలవడం కష్టమే అనే భావనకు వచ్చారంతా. ఎందుకంటే 10 ఓవర్లకు గాను సౌతాఫ్రికా చేసింది కేవలం 40 పరుగులే. అయితే ఆ జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడూ టీమిండియా చేసిన పొరపాట్లే సౌతాఫ్రికా కు విజయం కట్టబెట్టాయనే చెప్పాలి.హాఫ్ సెంచరీకి ముందు మర్క్రమ్ అద్భుతమైన క్యాచ్ ను విరాట్ కోహ్లీ సునాయసంగా వదిలేశాడు. ఆ తరువాత డేవిడ్ మిల్లర్ ఈజీ రన్ అవుట్ ను రోహిత్ శర్మ మిస్ చేశాడు. ఫలితంగా మర్క్రమ్, మిల్లర్ హాఫ్ సెంచరీలతో చెలరేగి సౌతాఫ్రికా కు విజయాన్ని అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -