Sunday, May 12, 2024
- Advertisement -

గొప్ప మనసు ఉన్న వ్యక్తి రామ్ చరణ్

- Advertisement -
ram charan shows his kind once again

మెగాస్టార్ రామ్ చరణ్ సినిమాలో ఎవరైనా కష్టాల్లో ఉంటే ఎలా అదుకుంటాడో… నిజ జీవితంలో కూడా అదే చేసి..  సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నాడు. తనకు చేతనైన సాయం చేస్తూ, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ, ఇబ్బందుల్లో ఉన్న వారిని హక్కున చేర్చుకుంటూ ఉంటాడు. తాజాగా మరో మంచి పని చేసిన రామ్ చరణ్ మంచి మనసున్నవాడు అని నిరూపించుకున్నాడు. తాజాగా రామ్ చరణ్ ఇద్దరు పిల్లలకు ఉన్న సమస్యను తీర్చాడు.

పుట్టుకతోనే ఆ ఇద్దరు పిల్లలకు చెవులు పని చేయడం లేదు. దాంతో వారు ఎలాంటి శబ్దాలు కూడా వినలేని పరిస్థితి. అయితే ఆ ఇద్దరికి ఆపరేషన్ చేయడం వల్ల వినే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. అయితే ఆ తల్లిదండ్రులకు ఆపరేషన్ చేయించే స్తోమత లేదు. దాంతో దాతల కోసం వారు ఎదురు చూశారు. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్.. ఆ సమయంలోనే సహి హాస్పిటల్ వారితో కలిసి ఆ ఇద్దరు పిల్లలకు వినిపించేలా చేశాడు. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఫేస్ బుక్ ద్వారా తెలియజేశాడు.

దీంతో రామ్ చరణ్ అభిమానులు తమ అభిమాన హీరో చేసిన మంచి పనిని అభినందిస్తున్నారు. ఇక పవన్ అభిమానులు కూడా చరణ్ చేసిన మంచి పనిని అభినందిస్తున్నారు. పవన్ లాగే చరణ్ కూడా మంచి మనసు ఉన్న వ్యక్తి అని అంటున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Related

  1. పవన్, త్రివిక్రమ్ సినిమా ఎప్పుడంటే?
  2. పవన్ దెబ్బకి షాక్ లో ఉన్న మ‌హేష్‌ బాబు!
  3. డైరెక్టర్ ను తిట్టి సెట్స్ నుంచి వెళ్లిపోయిన పవన్! ఏం జరిగింది?
  4. రామ్ చరణ్ కోసం పవన్ ఏం చేస్తున్నాడో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -