Tuesday, May 7, 2024
- Advertisement -

తెలుగు సినిమాలకు చెమటలు పట్టిస్తున్న “కాంతార”

- Advertisement -

డబ్బింగ్ సినిమాలకు మొదటి నుంచి కూడా తెలుగులో మంచి డిమాండ్ ఉంది. కంటెంట్ నచ్చితే చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అదరిస్తారు తెలుగు ప్రజలు. అందుకే ఇతర ఇండస్ట్రీలలోని హీరోలు తెలుగులో మార్కెట్ కోసం తహతహలాడుతూ ఉంటారు. ఇంతవరకు తెలుగులో తమిళ్ డబ్బింగ్ సినిమాలదే హవా. తమిళ్ హీరోలలో రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య వంటి హీరోలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. వీరి సినిమాలు తెలుగులో కూడా మంచి వసూళ్లు రాబడుతూ ఉంటాయి.

ఇక ఇప్పుడు కన్నడ సినిమాలు కూడా తెలుగులో సత్తా చాటుతున్నాయి. కన్నడ ఇండస్ట్రీ కి చెందిన ” దండుపాల్యం ” సిరీస్ తెలుగులో కూడా హిట్ గా నిలిచింది. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన కే‌జి‌ఎఫ్ సిరీస్ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. కే‌జి‌ఎఫ్ 2 ఒక్క తెలుగులోనే 180 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి డబ్బింగ్ సినిమాలలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఆ తరువాతి స్థానంలో రోబో 120 కోట్లతో రెండవ స్థానంలో ఉండగా 80 కోట్ల వసూళ్లు సాధించి రోబో 2.0 మూడవ స్థానంలో ఉంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన కాంతార మూవీ కూడా తెలుగులో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు రాబడుతోంది.

ఇప్పటికే ఒక్క తెలుగులోనే 60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ కలెక్షన్స్ ఇంకా స్టెడీ గా కొనసాగుతున్నాయి. ఇక ఫుల్ రన్ లో మూవీ 100 కోట్ల మార్క్ ను ఈజీగా క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరడం అంతా ఈజీ కాదు. ఇక్కడి స్టార్ హీరోలకే ఆ ఫిట్ అందుకోవడం అప్పుడప్పుడు కష్టమౌతుఉంటుంది. ఇక సెకండ్ స్టేజ్ హీరోలకు 100 కోట్ల క్లబ్ అనేది ఒక డ్రీమ్. అలాంటి టార్గెట్ కు ఒక చిన్న సినిమాగా చిన్న మూవిగా రిలీజ్ అయిన ” కాంతార ” సినిమా 100 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ మూవీని బట్టి తెలుగు ప్రేక్షకులు కంటెంట్ నచ్చితే ఏ స్థాయిలో ఇష్టపడతారో మరోసారి రుజువైంది. మరి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్న ప్రకారం కాంతార 100 సాధిస్తుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మహేశ్ రాజమౌళి స్టోరీ అదేనట.. రాజమౌళి క్లారిటీ !

ఆదిపురుష్ కు సవాల్ గా మారిన హనుమాన్!

తెలుగు తమిళ్ మద్య చిచ్చు పెట్టిన విజయ్ తలపతి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -