సరికొత్త క్రైమ్ కామెడీ కి తెలుగు లో తెర లేపాడు డైరెక్టర్ సుదీర్ వర్మ. స్వామీ రారా తో ఆ ప్రయోగం చెయ్యడమే కాకుండా సక్సెస్ఫుల్ గా హిట్ కూడా కొట్టేసి వినోదాన్ని తెరమీద పండించాడు. హీరోనే మోసగాడు గా చూపిస్తూ మధ్యలో ఒక లవ్ స్టోరీ ని అంటిస్తూ సరదాగా సాగే స్క్రీన్ ప్లే తీయడంలో సుధీర్ కొత్త పంథా మొదలు పెట్టాడు.
క్యారెక్టర్ బిహేవియర్ లో కన్ఫ్యూజన్ తో కూడిన రక్తి కట్టించే డ్రామా ఉంటుంది. తరవాత దోచెయ్ సినిమాతో సరిగ్గా ఫార్ములా వర్క్ కాక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల పడ్డాడు సుదీర్ వర్మ.ఇప్పుడు రవితేజ తో సినిమాకి సిద్ధం అవుతున్నాడు సుధీర్ వర్మ రవితేజకు ఓ కథ చెప్పాడు. ఈ ఇద్దరి కలయికలో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే అది ఫైనల్ అయ్యిందన్న కన్ఫర్మేషన్ న్యూస్ మాత్రం లేనేలేదు.
ఈ సినిమా కి సంబంధించి మనకి చాలా ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. రొటీన్ మూస యాక్షన్ సినిమాల్లో నటిస్తున్న రవి తేజ తో ఒక ప్రయోగం తీస్తూ కమర్షియల్ పంథా ఎక్కడా తప్పకుండా సుదీర్ స్క్రిప్ట్ రాసుకున్నాడు అని చెబుతున్నాడు. ఇప్పుడు కాన్ డ్రామా అంతకంటే స్టయిలిష్ గా ఫన్నీగా ఉంటుందని చెబుతున్నారు.కథ – కంటెంట్ నచ్చడం వల్లే రవితేజ ఓకే చేశాడని చెప్పుకుంటున్నారు.