Wednesday, April 24, 2024
- Advertisement -

పుష్ప 2 లీకు వెనుక అసలు కారణం ఇదే?

- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా హ్యాట్రిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం “పుష్ప” వీరిద్దరి కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2, సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి వీరి కాంబినేషన్లో వస్తున్న “పుష్ప” మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి.ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌గా ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. నిజానికి సుకుమార్ అనుకున్న కథ ప్రకారం సినిమా నిడివి చాలా ఎక్కువగా వస్తుంది. దీంతో రెండు భాగాలుగా రిలీజ్ చేస్తే బాగుంటుందా అని ఆలోచనలో పడ్డాడట. ఈ అంశానికి సంబంధించి చిత్ర యూనిట్ కావాలని మీడియాకు లీక్ చేసిందని ప్రచారం జరుగుతోంది. అభిమానుల నుంచి వచ్చే స్పందన బట్టి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Also read:పవన్ కళ్యాణ్ అలా అంటే నాకు ఇష్టం… షాకింగ్ వ్యాఖ్యలు చేసిన వర్మ!

అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో రాబోతుందట. మురుగదాస్ బ్లాక్ బస్టర్ మూవీ గజిని సినిమాకి సీక్వెల్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ను సంప్రదించినట్లు . ఇక అల్లు అర్జున్ ఈ సినిమాని ఓకే చేస్తాడనే సమాచారం గట్టిగా వినపడుతోంది.

Also read:వామ్మో.. అల్లరి నరేష్ సినిమాలో దారుణమైన బూతులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -