Thursday, April 25, 2024
- Advertisement -

ఎన్టీఆర్ పుట్టినరోజుకు అభిమానులకు ఈసారి కూడా నిరాశ తప్పదా!

- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి వంశం నుంచి హీరోగా పరిచయం అయిన జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ లో అద్భుతమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీపై తెలుగు ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

రాజమౌళి “ఆర్ఆర్ఆర్” సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ తన 30వ చిత్రం సెన్సేషనల్ మాస్ డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నారు అన్న విషయం మనకు తెలిసిందే.ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘జనతా గ్యారేజ్’ ఈ మూవీ బాక్సాఫీస్ షేక్ చేస్తూ ఏ రేంజ్‌లో సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే.మరోసారి ఈ బ్లాక్‌బస్టర్ కాంబోలో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also read:వామ్మో.. అల్లరి నరేష్ సినిమాలో దారుణమైన బూతులు..!

తెలుగు ఇండస్ట్రీలో కరోనా కారణంగా చాలా సినిమాల షూటింగ్స్ జరగడం లేదు. ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇంకా షూట్ ప్రారంభం కాలేదు. కాబట్టి ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాకపోవచ్చు. దీంతో ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ మూవీపై కచ్చితంగా అప్డేట్స్ వస్తాయని ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఎన్టీఆర్ బర్త్ డే రోజు అభిమానులలో నిరాశ మిగలుతుందా లేక ఏ సినిమా గురించి అయినా అప్డేట్ ఇచ్చి ఆనందం రెట్టింపు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే.

Also read:అనుపమ రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ చిత్రాలు ఇవే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -