Friday, April 26, 2024
- Advertisement -

ఒక్క ట్వీట్ తో.. రూమర్లకు చెక్ పెట్టిన యాంకర్ సుమ!

- Advertisement -

విలక్షణ నటుడు రాజీవ్‌ కనకాల శుక్రవారం తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి సుమ కనకాల  సోషల్ మీడియాలో స్పెషల్ విష్‌ చేశారు. నాకు ఎంతో ఇష్టమైన రాజా.. నీకు హ్యాపీ బర్త్‌డే. నువ్వే నా బలం, నా సంతోషం. ప్రతి రోజు కొత్త రోజుగా నీతో ఉండాలనుకుంటున్నా. లవ్‌ యు. నీతో నేను ఏకత్వంతో ఉన్నా అని కామెంట్ పెట్టారు. సుమ ట్విట్టర్ సందేశం చూస్తుంటే ఆమెకు భర్త రాజీవ్ పై ఉన్న ప్రేమాభిమానాలు తెలుస్తున్నాయి. బుల్లితెరపై నటిగా కెరీర్ ప్రారంభించిన సుమ కెరీర్ బిగినింగ్ లోనే నటుడు రాజీవ్ కనకాల ప్రేమలో పడ్డారు.

రాజీవ్ కనకాల-సుమ 1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మలయాళ అమ్మాయి అయిన సుమ తెలుగుతో పాటు పలు భాషలు అనర్గళంగా మాట్లాడగలదు. కాగా రాజీవ్‌, సుమల మధ్య గొడవలైనట్లు.. వారిద్దరు విడివిడిగా ఉన్నట్లు ఆ మధ్యన వార్తలు చక్కర్లు కొట్టాయి. రాజీవ్‌ తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారు సర్దిచెప్పేవారని, కానీ వారిద్దరు కాలం చేయడంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారని, సుమ పిల్లలతో పక్కన ఉండోందని ఏవేవో పుకార్లు వినిపించాయి. అయితే వాటన్నింటిని ఆ మధ్యన సుమ తన షోలో కొట్టిపారేశారు. 

ఇక బిగ్ బాస్ లో నాగ్ తో కూడా ఆయన పాట పాడితేనే నేను రెండు జోల పాటలు పాడా అని ఫన్నీగా సమాధానం ఇచ్చింది. అంతే కాదు ఇటీవల సుమా హూస్ట్ గా వ్యవహరిస్తున్న  క్యాష్‌ షోలో రాజీవ్‌ వచ్చినప్పుడు సుమ చాలా ఎమోషనల్‌ అయ్యారు. ఐ లవ్‌ యు రాజా అంటూ స్టేజ్‌ మీదనే ఏడ్చేశారు. ఇక ఇప్పుడు మరోసారి తన భర్తపై ప్రేమను చాటుకున్నారు.

మళ్ళి ప్రేమ వివాహనికి రెడీ అవ్వుతున్నా ప్రభుదేవా..?

స్టార్ డైరెక్టర్ కు నో చెప్పిన సాయిపల్లవి..

టాలీవుడ్ యంగ్ హీరోల చూపు త్రివిక్రమ్ వైపు…?

కాస్టింగ్ కౌచ్ పై వర్షిణి షాకింగ్ కామెంట్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -