Thursday, May 2, 2024
- Advertisement -

ప్రస్తుతం అలాంటి ఆలోచనే లేదు… ఫోకస్ అంతా కెరియర్ పైనే: అంజలి

- Advertisement -

అచ్చ తెలుగు అమ్మాయి అంజలి హీరోయిన్ గా తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే హీరోయిన్ అంజలి మొదట “ఫోటో”సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి తర్వాత ప్రేమలేఖ రాశా వంటి సినిమాల్లో నటించినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు రాలేదనే చెప్పాలి. దీంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన అంజలి అక్కడ మంచి గుర్తింపు లభించింది స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

అంజలి తమిళంలో విజయం సాధించిన “జర్నీ” వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. తరువాత “సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు” సినిమాలో సీత పాత్రలో అద్భుతంగా నటించి తెలుగులో గ్రాండ్ సక్సెస్ ను అందుకని వరుస సినిమాల్లో నటించింది. అంజలి చివరిగా నిశ్శబ్ధం సినిమాలో ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో అంజలి నటించిన”ఆనందభైరవి”సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అలాగే ఎఫ్ 3 సినిమాలో కూడా నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది.

Also read:వామ్మో ..ప్రభాస్ ఆది పురుష్ రెమ్యూనరేషన్ తెలిస్తే కళ్ళు తిరిగిపోవాల్సిందే!

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీలో అంజలి కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే కొంతకాలంగా సోషల్ మీడియాలో అంజలి త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.తాజాగా హీరోయిన్ అంజలి స్పందిస్తూ ప్రస్తుతం నాకు అలాంటి ఉద్దేశ్యమే లేదని నా ఫోకస్ అంతా కెరీర్ మీదే ఉంచాను అంటూ తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చింది.

Also read:ఆ సినిమా తర్వాత మరోసారి జక్కన్న దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -