Friday, March 29, 2024
- Advertisement -

ఆ సినిమా తర్వాత మరోసారి జక్కన్న దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ “ఆర్ఆర్ఆర్” లో గిరిజన వీరుడు కొమురం భీమ్‌ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూవీపై తెలుగు ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాతే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని రాజమౌళి ఆలోచనలో ఉన్నాడట.

జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ చేయబోయే మూవీస్ గురించి ఇటీవలే క్లారిటీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. కొరటాల ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ తదుపరి 31వ సినిమాను కే జిఎఫ్ ప్రేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నట్టు ప్రకటించాడు.

Also read:అలాంటి వార్తలు నమ్మకండి.. మా ఆయన ఆ పని చెయ్యట్లేదు!

ఇది ఇలాఉండగా జూనియర్ ఎన్టీఆర్ మరో రెండు సినిమాలు కూడా స్క్రిప్ట్ స్టేజ్‌లో ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కొరటాల, త్రివిక్రమ్‌ సినిమాలు పూర్తయ్యే సరికి 2023 జూన్‌ వచ్చేస్తుంది. తర్వాత అట్లీ కుమార్ దర్శకత్వం ఎన్టీఆర్‌తో సినిమాచేయబోతున్నట్లు సూచన ప్రాయంగా చెప్పేశారు. అట్లీ సినిమా తరువాత మరోసారి జక్కన్నతో జత కట్టేందుకు ఓకే చెప్పారు. అంటే మళ్ళీ ఎన్టీఆర్‌,రాజమౌళి కామినేషన్ మరో మూడు సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

Also read:రామ్ కోసం విలన్ గా మారనున్న స్టార్ యాక్టర్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -