విజయ్ బీస్ట్ కి నెట్ ఫ్లిక్స్ బిగ్ ఆఫర్.. ఇళయ దళపతి ఓకే చెబుతాడా..!

కొలీవుడ్ లో ఇళయ దళపతి విజయ్ కి ఉన్న రేంజు అంతా ఇంతా కాదు. ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ కూడా అక్కడ వంద కోట్ల క్లబ్ లలో చేరుతుంటాయి. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన సొంతం. తాజాగా ఆయన నటించిన మాస్టర్ సినిమాకు నెగిటివ్ రివ్యూస్ వచ్చినా బాక్సాఫీసు వద్ద రూ 200 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.ఈ మూవీ తరువాత విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో బీస్ట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది.

పాన్ ఇండియా కేటగిరిలో నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదల కాగా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం తమిళనాడు లో కరోనా కారణంగా థియేటర్లు ఓపెన్ కాలేదు. దీంతో విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని టాక్ నడుస్తోంది.

నెట్ ఫ్లిక్స్ వారు ఇప్పటికే ఈ సినిమా మేకర్స్ ను కలిసి సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఇప్పటివరకు ఏ ఓటీటీ వేదిక ఇవ్వనంత రేంజ్లో భారీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.అయితే ఇంతవరకు విజయ్ హీరోగా నటించిన ఏ సినిమా ఓటీటీ లో విడుదల కాలేదు. విజయ్ సినిమా థియేటర్లో విడుదల అయితే ఆ సందడే వేరు. ఓటీటీలో విడుదల అయితే అభిమానులు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందా..లేదంటే థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత విడుదల చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Also Read: ఎవరూ ఊహించని కాంబినేషన్.. పాన్ ఇండియా హీరోల మల్టీ స్టారర్..!

Related Articles

Most Populer

Recent Posts