సుకుమార్, మహేష్ మధ్యే మనస్పర్థలు తొలగినట్టేనా..!

- Advertisement -

టాలీవుడ్ లో చేసిన అతి తక్కువ సినిమాలతోనే ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సుకుమార్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆర్య, 100% లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. ఆయన ప్లాప్ సినిమాలు కూడా వైవిధ్య కరమైన సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. కాగా సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్లో వన్.. నేనొక్కడినే అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు పొందింది.

ఆ తర్వాత సుకుమార్ -రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ మహేష్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అందుకోసం ఏడాదిపాటు వెయిట్ చేసి కథ సిద్ధం చేశాడు. అన్ని రోజులు ఎదురు చూసినప్పటికీ మహేష్ బాబు సినిమా ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సుకుమార్ ను కాదని అనిల్ రావిపూడి తో సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.

దీంతో నొచ్చుకున్న సుకుమార్ అదే కథతో అల్లు అర్జున్ తో సినిమా ప్రారంభించారు. అదే పుష్ప మూవీ. మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథతోనే సుకుమార్ అల్లు అర్జున్ ను ఒప్పించి సినిమా చేస్తున్నారు. సుకుమార్ సినిమా రిజెక్ట్ చేసినప్పటి నుంచి వారిద్దరి మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరిగింది. ఈ రెండేళ్ల కాలంలో సుకుమార్, మహేష్ ఎక్కడ కలిసిన దాఖలాలు కూడా లేవు.

కాగా తాజాగా సుకుమార్ మహేష్ బాబును కలిశారు. నిన్న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఓ యాడ్ షూటింగ్ లో మహేష్ ఉన్నారు. అక్కడికి సమీపంలోనే పుష్ప షూటింగ్ జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో మహేష్ బాబు ఉన్నట్లు తెలుసుకున్న సుకుమార్ అక్కడికి చేరుకొని మహేష్ ని పలకరించారు.

మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట మూవీ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మహేష్ ను అభినందించడానికి సుకుమార్ అక్కడికి వెళ్ళినట్లు సమాచారం. ఈ సందర్భంగా వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుతున్నారు. ఆ సమయంలో తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుకుమార్, మహేష్ కలవడంతో వారిద్దరూ మళ్ళీ ఒక్కటైనట్లేనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read

పూరి ప్రేమ కథ గురించి ఎవరికి తెలియని నిజాలు..!

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్’

దేశంలోనే ఐఏఎస్ టాపర్స్.. ప్రేమించి మతాంతర వివాహం.. చివరికిలా..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -