Saturday, April 20, 2024
- Advertisement -

సూర్యకు తెలుగులో ఫాలోయింగ్ మామూలుగా లేదు.. ఇదే రుజువు..!

- Advertisement -

తమిళ స్టార్ హీరో సూర్య విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తమిళనాడులో కమల్ హాసన్ తర్వాత బాగా నటించే హీరోల్లో సూర్య ఒకడు. ఆయనకు తమిళ్ లోనే కాదు తెలుగులోనూ భారీగా ఫాలోయింగ్ ఉంది. నిజం చెప్పాలంటే తమిళ్ కంటే తెలుగులోనే ఆయనకు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటించిన సినిమాల కలెక్షన్లే ఇందుకు నిదర్శనం.

సూర్య నటించిన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకే రోజు విడుదల అవుతుంది. అయితే చాలా సందర్భాల్లో తమిళ్ లో కంటే తెలుగు వర్షన్ ఎక్కువ కలెక్షన్లు సాధించిన సందర్భాలు ఉన్నాయి. సూర్య కెరీర్లో గజిని సినిమా సూపర్ హిట్. ఆ సినిమా తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువగా కలెక్షన్లు సాధించింది. తాజాగా ఆయన నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమా తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ ద్వారా ఒకేసారి స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

అలాగే ఆ సినిమాలోని ‘కాటుక కనులే’ పాట యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. ఈ పాట తమిళ వర్షన్ యూట్యూబ్ లో 6.3కోట్ల వ్యూస్ సాధించగా, తెలుగు వెర్షన్ సాంగ్ ఏకంగా 10 కోట్ల వ్యూస్ కొల్లగొట్టింది. దీనిబట్టి సూర్యాకు తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉందని అర్థమవుతోంది. సూర్య ప్రస్తుతం వాడివాసల్ అనే మూవీతో పాటు మణిరత్నం దర్శకత్వంలో నవరస అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

Also Read : నాని .. అస్సలు తగ్గట్లేదు.. ఏడాదిలోనే మూడు సినిమాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -