సోనూసూద్ కు మెగాస్టార్ స్పెషల్ బర్త్ డే విషెస్.. ఇంకా వైరల్ లోనే ట్వీట్..!

- Advertisement -

రియల్ హీరో సోనూ సూద్ నిన్న జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. ఆయనకు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నలుమూలల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ట్విట్టర్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన సోనూసూద్ కు శుభాకాంక్షలు చెబుతున్న సందేశాలే కనిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి సోనూసూద్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్ ఒకరోజు గడిచినా ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది.

‘ప్రియమైన సోను సూద్.. మీరు నిజమైన జీవితాన్ని గడుపుతున్నారు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి ఉండదు మీరు ఇలాగే ఎప్పుడూ తోటివారికి సహాయం చేస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్డే సోను సూద్’ అని చిరు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి ఇప్పటిదాకా 2500 కు పైగా రీ ట్వీట్స్, 18.7కే లైక్స్ వచ్చాయి. ఈ ట్వీట్ ఇంకా వైరల్ అవుతూనే ఉంది.

- Advertisement -

సోనూసూద్ బర్త్ డే సందర్భంగా ఆచార్య లో సోనూసూద్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో నుదుట బొట్టు పెట్టుకొని పిలకతో సోనూ ప్రత్యేకంగా కనిపించారు. ప్రస్తుతం ఆచార్య తొలి షెడ్యూల్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా కొద్ది రోజులుగా సోనూ హైదరాబాద్ లో ఉంటున్నారు.

Also Read

అదిరిపోయే రేంజ్ లో అధీరా లుక్..!

ఓ రేంజ్ లో అఖండ ఇంటర్వెల్ బ్యాంగ్..!

త్రిష పెళ్లి వార్తలు నిజం కాదట..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -