Thursday, March 28, 2024
- Advertisement -

విడుదలకు ముందే ఏకే రికార్డ్స్.. ఇది కదా పవన్ స్టామినా..!

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిట్, ప్లాప్ లతో సంబంధంలేకుండా ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటు తుంటాయి. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే. మూడేళ్ల విరామం తర్వాత ఆయన నటించిన వకీల్ సాబ్ సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఆయన సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియమ్, క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నాడు.

వీటిలో అయ్యప్పనుమ్ కోషియమ్ సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. కాగా ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ హిందీ డబ్బింగ్ హక్కులు భారీ రేటుకు అమ్ముడు పోయినట్లు సమాచారం. సుమారు రూ.23 కోట్లకు హిందీ హక్కులను కొనుగోలు చేసినట్లు టాక్ వస్తోంది. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ మినహా ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాను ఇంత మొత్తంలో చెల్లించి డబ్బింగ్ హక్కులను కొనలేదు.

హిందీ లో బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చూడ్డానికి అక్కడి ప్రేక్షకులు ఆసక్తి చూపుతుంటారు. అందుకే ఆయన తీసే సినిమాలకు హిందీ డబ్బింగ్ రేట్లు బాగా వస్తుంటాయి. రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.21 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ రికార్డును పవన్ కళ్యాణ్ బద్దలు కొట్టారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా హీరోగా నటించడం కూడా కలిసి వచ్చింది. ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నప్పటికీ స్క్రీన్ ప్లే, మాటలు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. అందువల్లే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

Also Read : రాధే శ్యామ్ లవ్ స్టోరీ కానే కాదట.. నిజమెంతా ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -