నాని .. అస్సలు తగ్గట్లేదు.. ఏడాదిలోనే మూడు సినిమాలు..!

- Advertisement -

నేచురల్​ స్టార్​ నాని ఈ ఏడాది వరుసగా మూడు సినిమాలను విడుదల చేయనున్నాడు. కరోనా సమయంలో అగ్ర హీరోలు నటించిన ఒక్క సినిమా విడుదల అవడమే గగనం గా మారుతుండగా నాని మాత్రం మూడు సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేయబోతున్నాడు. నానికి భారీ మార్కెట్ ఉండకపోవచ్చు. అభిమాన సంఘాలు, హడావుడి లేకపోవచ్చు. కానీ నాని అంటే ప్రొడ్యూసర్లకు ఎంతో ఇష్టం. ప్రేక్షకులకు కూడా పిచ్చి లైక్​. ఎందుకంటే నాని సినిమాకు వెళితే మినిమం ఎంటర్​టైయిన్మెంట్ పక్కా. దర్శకుడు ఎవరైనా.. ఫ్రేమ్​లో నాని ఉన్నాడంటే బోర్​ కొట్టదు. దీంతో ఈ నానికి వరస అవకాశాలు వస్తున్నాయి.

లాక్​డౌన్​ టైంలో కూడా వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే నాని ‘టక్ జగదీష్’ సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక శ్యామ్​ సింగరాయ్​ షూటింగ్​ కూడా పూర్తయ్యింది. ఈ మూవీ కోసం నాని పూర్తిగా తన గెటప్​ను చేంజ్​ను చేసిన విషయం తెలిసిందే. తాజాగా ‘అంటే సుందరానికీ’ సినిమా సెట్స్ లో అడుగుపెట్టాడు. ఈ మూవీ వేగంగా పూర్తిచేసుకొని ఈ ఏడాది మూడు సినిమాలు విడుదల చేయాలని నాని చూస్తున్నాడు.

ఆగస్ట్​ రెండవ వారంలో టక్​ జగదీశ్​ విడుదలయ్యే చాన్స్​ ఉంది. ఇక ఆలోపు శ్యామ్​ సింగరాయ్​ పోస్ట్ ప్రొడక్షన్​ పనులు కూడా పూర్తవుతాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్​లో మూవీ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక తాజాగా షూటింగ్ ప్రారంభించిన అంటే సుందరానికి సినిమాను త్వరగా షూటింగ్ ముగించిఈ ఏడాది చివరినాటికి విడుదల చేసేలా నాని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.మొత్తానికి ఈ ఏడాది మూడు సినిమాలు బయటకు వచ్చేలా ప్లాన్​ చేశాడు నాని.

Also Read

బన్నీ లైనప్ లో మరో డైరెక్టర్..ఎవరంటే..!

దృశ్యం -2 రిలీజ్​ ఎప్పుడంటే?

స్పెషల్​ సాంగ్​కోసం సన్నీ లియోన్​ రెమ్యునరేషన్​ ఎంతంటే?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -