తమన్నాకి ‘పెళ్లి చూపులు’ కుదిరాయి..!

tamannaah to star in tamil remake pelli of choopulu

స్టార్ హీరోయిన్ తమన్నా సొషల్ మీడియాలో కనిపించకపోయేసరికి..  వెంటనే ‘పెళ్లెప్పుడు..? అని అడుగుతుంటారు. తమన్నా ఈ ప్రశ్న చాలాసార్లు ఎదుర్కొన్నారు. ‘జరిగినప్పుడు చెబుతానండి’ అని జవాబు ఇస్తూ దాటుకొచ్చిందీ బ్యూటీ.

అయితే ఇప్పుడు తమన్నా పెళ్లిచూపులకు రెడీ అయ్యింది. కంగారుపడకండి… తమన్నా పెళ్లి చూపులేంటి..పెళ్లి చేసుకోవటానికి ఫిక్సైందా అని అనుకోకండి.. తమన్నాకు పెళ్లిచూపులు జరుగుతున్నాయి కానీ నిజ జీవితంలో కాదు… పెళ్లి చూపులు తమిళ రీమేక్ లో. అవును..తమన్నా..తమిళ పెళ్లి చూపులు రీమేక్ లో హీరోయిన్ గా చేయటానికి ఎంపికైందని కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం. విజయ్‌ దేవరకొండ, రితూ వర్మ నటించిన ‘పెళ్లి చూపులు’ తమిళ రీమేక్‌లో తమన్నా హీరోయిన్‌గా నటించనుంది.

ఈ చిత్రం తమిళ హక్కులను దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దక్కించుకున్నారు. కొత్త హీరోతో ఈ రీమేక్‌ని తన సహాయ దర్శకుడు సెంథిల్‌ వీరాస్వామి డైరెక్షన్ లో నిర్మించనున్నారు. తమన్నా స్టార్‌డమ్‌ ఈ చిత్రానికి వర్కవుట్‌ అవుతుందని గౌతమ్‌ మీనన్‌ తెలిపారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలు ఎక్కనుంది.

  1. నెట్ లో హల్ చల్ చేస్తున్న తమన్నా వీడియో!
  2. ఒక రాత్రికి తమన్నాను బుక్ చేసుకున్నారు.. ఎంతకో తెలుసా?
  3. అనుష్కను బాధపెడుతున్న తమన్నా
  4. రమ్యకృష్ణ కోరికను తీరుస్తున్న సీనియర్ డైరెక్టర్!