Sunday, May 12, 2024
- Advertisement -

అనుష్కను బాధపెడుతున్న తమన్నా

- Advertisement -

ఒక చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అని హీరోయిన్స్ చూస్తుంటారు. ఇదే విషయంపై కొన్ని సార్లు గొడవలు కూడా అవుతుంటాయి. ఇప్పుడు బాహుబలి సినిమాలో నటించిన హీరోయిన్స్ కూడా ఇదే విషయంపై ఇబ్బంది పడుతున్నారు. ఈ చిత్రంలో అనుష్క, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాహుబలి మొదటి పార్ట్ లో డీ గ్లామర్ రోల్ లో అనుష్క కనిపించింది.

బాహుబలి కంక్లూజన్ లో అనుష్కకు మంచి సన్నివేశాలు రాసుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఆ సీన్లను తెరకెక్కించాలని ఇప్పుడు అనుకుంటే అనుష్క బొద్దుగా తయారై ప్రాబ్లమ్ క్రీయేట్ చేసింది. “జీరో సైజ్” సినిమా కోసం అనుష్క బరువు పెరిగింది. బరువు తగ్గకపోవడంతో అనుష్క కోసం రాసిన సీన్లను పక్కన పెట్టి తమన్నాపై కొత్త సీన్లు షూటింగ్ చేయాలనీ రాజమౌళి అనుకుంటున్నాడట.

దీంతో రెండు సినిమాల్లో అనుష్క కనిపించే సీన్ల నిడివి బాగా తగ్గిపోయింది. కొన్ని సీన్లకే పరిమితం అవాల్సిన తమన్నా కంక్లూజన్ లోను ఎక్కువ సేపు కనిపించనుంది. ఈ విషయం తెలుసుకున్న అనుష్క చాలా బాధ పడుతోందట. ఎంత కష్టపడుతున్నా బరువు తగ్గక పోతున్నానని ఆవేదన చేందుతున్న అనుష్క కి తమన్నా ప్రస్తుతం పెద్ద తలనొప్పిగా మారిందని అనుకుంటున్నారు.

Related

  1. అనుష్క కి రాజమౌళి వార్నింగ్..?
  2. అనుష్క తో లిప్ కిస్ అంటే ఒద్దు అన్న హీరో
  3. షాకింగ్ : తమన్నా సీక్రెట్ పెళ్లి ?
  4. తమన్నా రేటు పెంచేసింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -