Monday, May 12, 2025
- Advertisement -

తమిళ లెజండ‌రీ డైరెక్ట‌ర్ జె. మహేంద్రన్ క‌న్నుమూత‌…

- Advertisement -

ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు, నటుడు జే మ‌హేంద్ర‌న్(79) కన్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఉద‌యం తుదిశ్వాస విడిచారు. ఇవాళ(2 ఏప్రిల్ 2019) ఉద‌యం చనిపోయినట్లు మహేంద్రన్ తనయుడు, దర్శకుడు జాన్ మహేంద్రన్ వెల్లడించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో ఎన్న హిట్ సినిమా అందించి ఆయన ఉన్నత శిఖరానికి చేర్చినవారిలో ఈయన ఒకరు. శంకర్‌, మణిరత్నం వంటి ప్రముఖ దర్శకులకు మార్గదర్శకుడిగా నిలిచారు. ముల్లుమ్ మ‌ల‌రుమ్‌, జానీ, నెంజ‌తై కిల్లాడే చిత్రాలు మ‌హేంద్ర‌న్‌కి ఎంత‌గానో పేరు తెచ్చిపెట్టాయి.

న‌టుడిగాను ప‌లు చిత్రాలలో న‌టించిన ఆయ‌న ఇటీవలే విజ‌య్ సేతుప‌తి సీతాకాతి, ర‌జ‌నీకాంత్ పేటా , బ్యూమ్రాంగ్ వంటి చిత్రాల‌లో క‌నిపించారు. 2018లో ఆయ‌న లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. 80 చిత్రాలకు దర్శకత్వం వహించిన మహేంద్రన్‌ రెండు సార్లు జాతీయ అవర్డును అందుకున్నారు. ఆయ‌న మ‌ర‌ణంతో త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ షాక్‌కి గుర‌యింది. ఆయ‌న మృతికి కోెలీవుడ్ వర్గాలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు, అభిమానులు, సినీ దర్శకుల సందర్శనార్థం పార్దీవదేహాన్ని ఉంచుతారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తాం అని కుటుంబ సభ్యులు వెల్లడించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -