బాలీవుడ్ సీనియర్ నటుడు చంద్ర‌శేఖ‌ర్ కన్నుమూత

- Advertisement -

ఒకప్పుడు బుల్లితెరపై ‘రామాయణం’సీరియల్ యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం సీరియల్ ప్రారంభమయ్యే సమయానికి చిన్నా.. పెద్దా అందరూ టీవీల ముందు అతుక్కుపోయేవారు. ఈ సీరియల్ లో నటించిన ఎంతో మంది నటులు వెండితెరపై కూడా తమ సత్తా చాటుకున్నారు. తాజాగా రామాయణం సీరియల్ లో ‘ఆర్య సుమంత్’ పాత్రను పోషించిన సీనియర్ నటుడు చంద్రశేఖర్ (98) కన్నుమూశారు. ధవారం ఉదయం 7 గంటలకు ముంబైలోని నివాసంలో మృతి చెందినట్టు ఆయన కుమారుడు, నిర్మాత అశోక్ శేఖర్ తెలిపారు. కుటుంబసభ్యులందరూ ఇంట్లో ఉన్న సమయంలోనే నిద్రలోనే ఆయన కన్నుమూశారని అశోక్ తెలిపారు.

ముంబై జుహులోని హాన్స్ క్రెమటోరియంలో ఆయన అంత్యక్రియలు ఈ సాయంత్రం జరగనున్నాయి. 1923లో హైదరాబాద్‌లో పుట్టిన చంద్రశేఖర్ నటనపై ఉన్న మక్కువతో 1950లో జూనియర్ ఆర్టిస్ట్‌గా మారారు. ఆ తర్వాత ‘సురంగ్’ అనే చిత్రంతో హీరోగా మారారు. ‘కవి’, ‘మస్తానా’, ‘బసంత్ బహార్‌’, ‘కాలీ టోపీ లాల్ రుమాల్’, ‘గేట్ ఆఫ్ ఇండియా’, ‘ఫ్యాషన్‌’, ‘ధర్మ’, ‘డ్యాన్స్ డ్యాన్స్‌’, ‘లవ్ లవ్ లవ్’ తదితర సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. 250కిపైగా చిత్రాల్లో చంద్రశేఖర్ కనిపించారు.

- Advertisement -

రామానంద్ సాగర్ దర్శకత్వంలో రూపొందిన ‘రామాయణ్ సీరియల్‌లో ఆర్య సుమంత్ అనే పాత్ర పోషించారు. 1964లో స్వీయ నిర్మాణంలో ‘ఛ ఛ ఛ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. 1966లో ‘స్ట్రీట్ సింగర్’ అనే సినిమాని తెరకెక్కించారు. 1970ల్లో ‘పరిచయ్‌’, ‘కౌశిష్’, ‘ఖుష్బూ’, ‘మౌసమ్’ తదితర సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పనిచేశారు. కాగా, చంద్రశేఖర్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు.

వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణం.. కన్నకూతురుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లిదండ్రులు

విశాఖలో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి

లోకేష్ బాబు ముద్ద పప్పు.. అందరూ ఆయనలా కావాలా? : ఎమ్మెల్యే రోజా ఫైర్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -