Monday, May 6, 2024
- Advertisement -

స‌మంతని ఇబ్బంది పెడుతున్న న‌టుడు ఎవ‌రు..?

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీ టాప్ హీరోయిన్ల‌లో స‌మంత ఒక‌రు. పెళ్లి త‌రువాత కూడా సినిమాల‌లో న‌టిస్తు త‌న జోరుని కొన‌సాగిస్తుంది స‌మంత‌. అక్కినేని హీరో నాగ చైత‌న్య‌ను స‌మంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌రువాత ఆమె న‌టించిన సినిమాలు అన్ని బాక్సాపీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్లుగా నిలిచాయి. ఆమె తాజాగా లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘బేబీ’ అనే సినిమాలో న‌టిస్తుంది.

ఈ సినిమాలో ఓ విభిన్న పాత్ర‌లో న‌టిస్తుంది స‌మంత‌. అయితే ఈ సినిమా షూటింగ్‌లో ఓ న‌టుడు స‌మంత‌ను తెగ ఇబ్బంది క‌లిగిస్తున్నాడ‌ట‌. సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఆ న‌టుడు తాగి రావ‌డంతో పాటు తోటి న‌టీ,న‌టుల‌కు ఇబ్బందికి గురి చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఈ న‌టుడుని సినిమా నుంచి త‌ప్పిద్దామ‌నుకున్నా…సినిమాలో ఈ న‌టుడు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ట‌. ఈ పాత్ర‌కు ఆ న‌టుడు అయితేనే బాగా చేస్తాడ‌ని,దీని కార‌ణంగానే ఆ నటుడిని ఇంకా సినిమాలో కొన‌సాగిస్తున్నార‌ని తెలుస్తోంది.

మ‌రి షూటింగ్ స‌మ‌యంలో తాగి వ‌చ్చి ఇత‌ర న‌టీ,న‌టుల‌ను ఇబ్బంది క‌లిగిస్తున్న ఆ న‌టుడు ఎవ‌రో తెలియాల్సి ఉంది. ఇక స‌మంత ఈ సినిమాతో భ‌ర్త నాగ‌చైగ‌త‌న్య‌తో క‌లిసి ‘మ‌జిలి’ అనే సినిమాలో కూడా న‌టిస్తుంది. పెళ్లి త‌రువాత వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ‘మ‌జిలి’ సినిమాను వ‌చ్చే వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -