Thursday, March 28, 2024
- Advertisement -

విజయ్ కొత్త సినిమా టైటిల్ ‘టార్గెట్’

- Advertisement -

తమిళ అగ్ర కథనాయకుడు, ఇళయ దళపతి విజయ్ వరుస బ్లాక్ బస్టర్లతో నంబర్ వన్ రేసులో ముందున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి ఆయన నటించిన మాస్టర్ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు వసూలు చేసిందంటే విజయ్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాగా విజయ్ జూన్ 22న తన బర్త్ డే వేడుకలు జరుపుకోనున్నాడు. ఏటా తన బర్త్ డే రోజు విజయ్ తన సినిమాలకు సంబంధించి గుడ్ న్యూస్ చెబుతుంటాడు. ఈ ఏడాది కూడా తను నటించబోయే సినిమాలకు సంబంధించి విశేషాలు ఏమైనా చెబుతాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కాగా విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈజిప్ట్ లో జరిగింది. కరోనా వ్యాప్తి పెరగడంతో ఈ సినిమా షూటింగ్ నిలిపివేసి చిత్రబృందం ఇండియాకు చేరుకుంది.

Also Read: సూపర్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టిన యువ హీరో..!

అయితే ఈ సినిమాకు ‘టార్గెట్ ‘ అనే టైటిల్ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని అఫీసియల్ గా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. విజయ్ తన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన విశేషం కానీ, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు సంబంధించి గానీ గుడ్ న్యూస్ గానీ చెబుతాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Also Read: ఫ్యామిలీ మ్యాన్​ 3 స్టోరీ ఏంటంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -