ఫ్యామిలీ మ్యాన్​ 3 స్టోరీ ఏంటంటే?

- Advertisement -

ఫ్యామిలీమ్యాన్​ వెబ్ సీరిస్​ తెరకెక్కించిన రాజ్​ అండ్​ డీకే పేర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్నాయి. ఇటీవల విడుదలైన ఫ్యామిలీ మ్యాన్​ -2 చిత్రం సంచలన విజయం నమోదుచేసుకుంది. ఈ చిత్రంలో నటించిన సమంతకు గొప్ప నటి అన్న పేరు తెచ్చిపెట్టింది. ఇక తమిళ ప్రజల నుంచి విమర్శలు వచ్చినప్పటికీ.. సమంతకు మంచి పేరే తీసుకొచ్చింది. సమంతను నల్లగా చూపించడం ఆమె ఫ్యాన్స్​కు అస్సలు నచ్చలేదు. కానీ కథా పరంగా ఆమె ఎల్​టీటీఐ ఉగ్రవాది కాబట్టి అలా చూపించవలసి వచ్చింది.

అయితే రాజ్​ అండ్​ డీకే తెలుగు వారేనన్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా వాసులు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నారు. అయితే ఇప్పుడందరి ఫోకస్​ ఫ్యామిలీ మ్యాన్​- 3 మీద పడింది. మూడో సీరిస్​లో ఎటువంటి కథను చూపించబోతున్నారని అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై రాజ్​ అండ్​ డీకే ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

- Advertisement -

‘ప్రస్తుతం మేమే ఫ్యామిలీ మ్యాన్​ -3 కోసం కథను సిద్ధం చేస్తున్నాం. అయితే ఇందుకోసం ఆడియన్స్​ నుంచి ఫీడ్​ బ్యాక్​ తీసుకుంటున్నాం. వాళ్ల ఇష్టప్రకారమే కథను సిద్ధం చేస్తాం. ఇక సమంత రంగు విషయంలో విమర్శలు వస్తాయని మేము ముందే ఊహించాం’ అని చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ మ్యాన్​ -2 క్లైమాక్స్ లో కరోనా వైరస్​ గురించి హింట్ ఇవ్వడంతో .. ఫ్యామిలీ మెన్​ – 3 లో కరోనా వైరస్​.. దాని పుట్టుక తదితర విషయాల మీదే సాగుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మొత్తానికి ఫ్యామిలీ మ్యాన్​ సీరిస్​ సోషల్​ మీడియాలో ట్రెండింగ్​గా మారింది.

Also Read

జుట్టు రాలుతోందా.. అయితే ఈ చిట్కాలను పాటించండి

రాత్రి నిద్రపోయే టైంలో ఈ ఆహారంతో ఆరోగ్యానికి మేలు !

గుడ్డుతో ఆ లాభం కూడా వుందట..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -