Friday, April 26, 2024
- Advertisement -

విశాల్ ఫిర్యాదుపై ఆర్.బి.చౌదరి ఆవేదన ..!

- Advertisement -

తమిళ సినీ హీరో విశాల్, నిర్మాత ఆర్.బి.చౌదరి మధ్య వివాదం కొనసాగుతోంది. ఆర్.బి.చౌదరి తనను మోసగించాడని ఇటీవల విశాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది. విశాల్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి ఉండాల్సింది కాదని, ఆర్.బి.చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ వారిద్దరి మధ్య జరిగిన వివాదం ఏంటంటే…విశాల్ ఇరుంబుతిరై సినిమాలో నటిస్తున్న సమయంలో ఆ సినిమాకు పెట్టుబడి పెట్టేందుకు డబ్బు అవసరమై నిర్మాత, ఫైనాన్సియర్ అయిన ఆర్.బి.చౌదరి వద్ద కొంతమేర డబ్బు అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు విశాల్ తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాడు.

అయితే విశాల్ అప్పు తీసుకునే సమయంలో షూరిటీ గా స్టాంపు పత్రాలు, చెక్కులు, తదితర డాక్యుమెంట్లు ఆర్.బి.చౌదరికి అప్పగించాడు. అయితే తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చిన తర్వాత కూడా ఆర్.బి.చౌదరి తాను అందజేసిన డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వలేదని విశాల్ ఆరోపిస్తూ ఈ నెల 7న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇది ఇప్పుడు వివాదంగా మారింది.

Also Read: బన్నీతో కలసి మెగాస్టార్ తీన్ మార్ స్టెప్పులు..!

ఈ విషయమై ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ తాను సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు అయ్యిందని, ఇప్పటివరకు నాలుగు భాషల్లో 92 చిత్రాలను నిర్మించానని, తన జీవితంలో ఎప్పుడూ ఎటువంటి మచ్చ పడలేదన్నాడు. తాను ఎటువంటి వ్యక్తినో దక్షిణభారత సినీ పరిశ్రమకు తెలుసని అన్నాడు. విశాల్ తన వద్ద అప్పు తీసుకున్న మాట నిజమేనని, ఆయన తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాడని ఆర్.బి.చౌదరి చెప్పాడు.

విశాల్ అప్పు తీసుకునే సమయంలో ఇచ్చిన డాక్యుమెంట్లు డైరెక్టర్ శివకుమార్ వద్ద ఉంచామని ఆర్.బి.చౌదరి చెప్పాడు. అయితే ఆయన ఆకస్మికంగా మృతి చెందడంతో పత్రాలు కనిపించకుండా పోయాయని తెలిపాడు. శివ కుమార్ బ్యాచిలర్ అని ఆయన విశాల్ అప్పగించిన డాక్యుమెంట్లు ఎక్కడ దాచాడో తెలియడం లేదని ఆర్.బి.చౌదరి తెలిపాడు.శివకుమార్ స్నేహితులతో కలిసి పలుచోట్ల వెతికినా డాక్యుమెంట్లు దొరకలేదని చెప్పాడు.

Also Read: తారక్​ మూవీలో విజయ్​ సేతుపతి..! ఏ క్యారెక్టర్​ అంటే?

ఈ విషయం గురించి తానే వేరొక వ్యక్తి చేత విశాల్ కు తెలియజేశానని, విశాల్ తనను సంప్రదించకుండానే ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు వివరించాడు. ఆ సమయంలో తాను విదేశాల్లో ఉండడంతో వెంటనే స్పందించి లేకపోయినట్లు తెలిపాడు. విశాల్ తనపై ఫిర్యాదు చేసినట్లు తెలుసుకొని ఆశ్చర్య పోయినట్లు చెప్పాడు. అలా కాకుండా విశాల్ తనను కలిసి ఇద్దరం వెళ్లి డాక్యుమెంట్లు కనిపించకుండా పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే బాగుండేదన్నాడు. విశాల్ ఒక్కరే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తన నలభై ఏళ్ల సినీ జీవితంలో ఎప్పుడూ ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోలేదని, విశాల్ కు సంబంధించిన డాక్యుమెంట్లు ఎవరి వద్ద అయినా ఉంటే అప్పగించాలని ఆయన ఈ సందర్భంగా కోరాడు.

Also Read: బీ టౌన్ పై తెలుగు అగ్ర హీరోల కన్ను..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -