Thursday, April 18, 2024
- Advertisement -

ఈ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా?

- Advertisement -

ఈ మద్య చాలా మంది సెలబ్రెటీలు తన అరుదైన జ్ఞాపకాలు సోషల్ మాద్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఈ మద్య స్టార్ హీరోల సినిమాలకు తన మ్యూజిక్ తో అద్బుత విజయాలు అందిస్తున్నాడు తమన్. ప్రస్తుతం టాలివుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు తమన్. ఇటీవల ఆయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు మ్యూజికల్ గానూ హిట్ అవుతున్నాయి. అరవింద సమేత సినిమానుంచి తమన్ సంగీతంలో చాలా చేంజెస్ వచ్చాయి.

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఆతర్వాత అల వైకుంఠపురం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు తమన్. ప్రస్తుతం తమన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్రాక్ – వకీల్ సాబ్ లాంటి హిట్స్ అందుకున్నాడు తమన్. ప్రస్తుతం తమన్ చేతినిండా సినిమాలతో గ్యాప్ లేకుండా బిజీ అయిపోయాడు.

భారతీయ చలన చిత్ర రంగంలో తన మధుర గానంతో కోట్ల మంది అభిమానులను సంపాదించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమాణ్యం జయంతి సందర్భంగా తమన తన అరుదైన జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

“మిస్ యూ మామా” అంటూ తన ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా తమన్ ఓ ఆసక్తికరమైన ఫొటో పంచుకున్నారు. 1996 నాటి ఫొటో.. దక్షిణ కొరియాలోని సియోల్ ఎయిర్ పోర్టులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తమన్ కలిసి ఉన్నప్పటి ఫొటో అది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వెళుతుండగా ఆ ఫొటో తీసుకున్నట్టు తమన్ వెల్లడించారు.

వయసుపై నెటిజెన్ కామెంట్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హీరోయిన్!

రాజమౌళి షార్ట్ ఫిలిం.. ఆర్ఆర్ఆర్ కంటే ముందే విడుదల!

యాంకర్ శ్యామల ఖరీదైన విల్లా వీడియో.. మీ అయన కొట్టేసిందేనా అంటూ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -