Saturday, April 27, 2024
- Advertisement -

రాజమౌళి షార్ట్ ఫిలిం.. ఆర్ఆర్ఆర్ కంటే ముందే విడుదల!

- Advertisement -

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఏదైనా ఒక సినిమాను చేపట్టాడు అంటే సుమారు రెండు సంవత్సరాల పాటు సమయం తీసుకుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా “ఆర్ఆర్ఆర్” సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే రాజమౌళి “ఆర్ఆర్ఆర్”సినిమా కంటే ముందుగా మరో సినిమా విడుదల కానుంది. అదేంటి ఎవ్వరికి తెలియకుండా రాజమౌళి మరొక సినిమా ఏంటి అని ఆలోచిస్తున్నారా.. అయితే రాజమౌళి చేయబోయేది ఫీచర్ ఫిలిమ్ కాదు.. షార్ట్ ఫిలిమ్.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రజలను రక్షించడానికి ఎండలను సైతం లెక్కచేయకుండా రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలకు సేవ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ గొప్పతనాన్ని తెలియజేసేలా రాజమౌళి షార్ట్ ఫిలిమ్ ను తెరకెక్కించనున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫిలిమ్ వివ‌రాల‌ను పోలీసు ఉన్న‌తాధికారుల‌కు తెలియ‌జేయ‌డం, వారు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

Also read:రికార్డ్ క్రియేట్ చేసిన దృశ్యం 2.. ఎందులో అంటే?

పోలీస్ డిపార్ట్మెంట్ పై షార్ట్ ఫిలిమ్ 19 నిమిషాల వ్య‌వ‌ధితో రూపొందించనున్నారు.అయితే ఈ షార్ట్ ఫిలిం కి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే దర్శకధీరుడు, జక్కన్న తెలియజేయునట్లు సమాచారం. ఇకపోతే రాజమౌళి “ఆర్ఆర్ఆర్” కోవిడ్ పరిస్థితులు చక్కదిద్దుకున్నాక తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Also read:నాగ చైతన్యతో గొడవలు జరుగుతున్నాయ్: సమంత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -