Friday, April 26, 2024
- Advertisement -

యాంకర్ శ్యామల ఖరీదైన విల్లా వీడియో.. మీ అయన కొట్టేసిందేనా అంటూ?

- Advertisement -

బుల్లితెర యాంకర్ గా కొనసాగిస్తున్న వారిలో యాంకర్ శ్యామలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంతో అద్భుతంగా అభినయంగా యాంకరింగ్ నిర్వహిస్తున్న శ్యామల యాంకర్ సుమ తరువాత గొప్ప యాంకర్ అని చెప్పవచ్చు. ఈరోజుల్లో సెలబ్రిటీల మొత్తం ఒకవైపు వారి వృత్తిపరమైన కార్యక్రమాలలో పాల్గొంటూ మరోవైపు తమ పేర్ల పై యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఎక్కువగా హోమ్ టూర్ చేయడం మనం చూస్తున్నాము.

Also read:క్రేజి ప్రాజెక్ట్స్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ నటులు వీళ్ళే!

తాజాగా యాంకర్ శ్యామల కూడా”ఏం చెప్పారు శ్యామల గారు”అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే శ్యామల యూట్యూబ్ ఛానల్ ద్వారా హోమ్ టూర్ అంటూ ఒక ఖరీదైన విల్లాను చూపించింది. ఈ విల్లా చూస్తే మాత్రం ప్రేక్షకులకు కళ్ళు తిరిగిపోవాల్సిందే. శ్యామల ఈ విల్లా మొత్తం పాలరాతితో నిర్మిస్తుండటం విశేషం. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ విల్లాను శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చూపించింది.

Also read:https:రికార్డ్ క్రియేట్ చేసిన దృశ్యం 2.. ఎందులో అంటే?

శ్యామల నిర్మించబోతున్న ఈ విల్లాలో ఎన్ని రూమ్స్, ఏ విధంగా ఇంటీరియర్ డిజైన్ ప్లాన్ చేశారు, ఈ హౌస్ ఎలా డెకరేట్ చేయబోతున్నారని విషయాలను ఈ వీడియో ద్వారా తెలిపారు. శ్యామల ఇల్లు చూస్తే ఎంతో అద్భుతంగా ఉంది అనిపించడంతో పాటు ఈ వీడియో కింద వచ్చే కామెంట్లు చూస్తే ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది.

గత కొన్ని రోజుల క్రితం యాంకర్ శ్యామల భర్త పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కోటి రూపాయల వ్యవహారంలో కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే.ఒక మహిళ దగ్గర నుంచి కోటి రూపాయలు డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వాల్సిందిగా మహిళ కోరడంతో డబ్బులు ఇవ్వకపోగా బెదిరిస్తున్నట్లు మహిళ ఫిర్యాదు చేయడంతో శ్యామల భర్త నరసింహారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయంపై శ్యామల భర్త ఏవిధంగా స్పందించకపోవడంతో నెటిజన్లు పెద్దఎత్తున మీ భర్త కొట్టేసిన కోటి రూపాయలతో విల్లా కొన్నావా… శ్యామల అంటూ యాంకర్ శ్యామలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం శ్యామల హోమ్ టూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి దాదాపు వన్ మిలియన్ వ్యూస్ సాధించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -