Monday, April 29, 2024
- Advertisement -

రేపు ఒకేసారి తొమ్మిది సినిమాలు ఇవే…!

- Advertisement -

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో శుక్రవారం వచ్చిందంటే సినిమాలు రిలీజ్ తో థియేటర్లు సందడిగా ఉండేది. కానీ కరోనా వైరస్ కారణంతో ఎంటర్ టైన్ మెంట్ కి పూర్తిగా గుడ్ బాయ్ చెప్పాల్సి వచ్చింది. ఈ మద్యనే షూటింగ్స్ మళ్లీ మొదలు పెట్టారు. థియేటర్లు రీ ఓపెన్ చేశారుే. దాంతో కొత్త సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి. ‘సోలో బతుకు సో బెటర్’ నుంచి వరుసగా ఒకటి తరువాత ఒకటి సినిమాలు విడుదల అవుతున్నాయి.

ఇక సమ్మర్ లో కూడా భారీ స్థాయిలో సినిమాలు విడుదల అవుతున్నాయి.ఈ శుక్రవారం(మార్చి 5న) కూడా దాదాపు 9 సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన 25వ సినిమా ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ కూడా ఉంది. మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన ‘పవర్ ప్లే’ కూడా రేపే విడుదల కానుంది.

వాటితో పాటు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ‘క్లైమాక్స్’ కూడా రేపే విడుదల కానుంది. ఇక సినిమాలను చూస్తే.. హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో రానున్న ప్లే బ్యాక్, సాగర్ ఆర్కే హీరోగా నటిస్తున్న షాదీ ముబారక్, తారకరత్న నటిస్తున్న దేవినేని, రాయ అండ్ ది లాస్ట్ డ్రాగన్ (ఇంగ్లీష్ డబ్బింగ్), ఓటీటీలో సీత ఆన్ రోడ్స్ సినిమాలు రేపు విడుదల కానున్నాయి. మరీ ఈ సినిమాల్లో ఏది హిట్ అవుతుందో.. ఏది ఫట్ అవుతుందో చూడాలి. కాకపోతే ఇవన్నీ చిన్న బడ్జెట్ చిత్రాలు.

పోలీసుల కొత్త ప్రయత్నం .. చూస్తే నవ్వుకోవడం పక్కా..!

ఆకట్టుకుంటున్న జాతి రత్నాలు ట్రైలర్…!

అయ్యయ్యో.. బాలయ్యకు ఏంటీ ఈ కష్టాలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -