Thursday, May 2, 2024
- Advertisement -

అయ్యయ్యో.. బాలయ్యకు ఏంటీ ఈ కష్టాలు !

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్స్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలకు ఏమాత్రం తక్కువ కాదన్నట్టే భారీ యాక్షన్ సినిమాలకు ఓకే చేసుకుంటూ వెళున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. సీనియర్ స్టార్స్ కు ఆ ఒక్క విషయం చాలా బాధ కలిగిస్తోంది. ముఖ్యంగా సీనియర్ స్టార్స్ తో సినిమాలు చేసే డైరెక్టర్లకు తలనొప్పి తెప్పించే సమస్య ఒకటి బాగా వేధిస్తోందట. ఇకపోతే ప్రస్తుతం నందమూరి నటసింహం వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఈ సీనియర్ స్టార్ బోయపాటి డైరెక్షన్ లో ‘బిబి3’ వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక సినిమా కూడా పూర్తి కావొచ్చింది. ఈ మూవీ తర్వాత బాలయ్య బాబు ‘క్రాక్’ తో హ్యాట్రిక్ కొట్టిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్నాడు. ఈ మూవీ ఉప్పెన తో ఘన విజయాన్ని అందుకున్న మూత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేసింది ఈ చిత్ర యూనిట్. ఇక గోపీచంద్ మలినేని కూడా ఈ నందమూరి నటసింహం కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్టును రెడీ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. అంతా బాగానే ఉన్నా.. ఈ సినిమాలో బాలయ్యకు సరిజోడును వెతికే సరికి డైరెక్టర్ కు తలప్రాణం తోకకు వస్తోందట.

ఎంత వెతికినా.. బాలయ్యకు సెట్ అయ్యే హీరోయిన్ మాత్రం దొరకడం లేదట. ఈ ఒక్క విషయమే గోపీచంద్ మలినేనికి తలనొప్పి తెప్పిస్తోందట. అయితే ఈ కథకు సరిపోయేట్టుగా బాలయ్యకు జోడీగా.. శ్రుతి హాసన్ అయితే బాగుంటుందని భావించారట డైరెక్టర్. ఇంకేముంది .. విషయాన్ని శ్రుతి హాసన్ కు చెప్పాడట. కానీ ఆ అమ్మడు సింపుల్ గా ‘నో’ అని చెప్పేసిందని సమాచారం. తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా మారి కుర్ర హీరోలకు జోడీగా అవకాశాలు అందుకుంటున్న సమయంలో బాలయ్య సరసన నటించే అవకాశమే లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

‘సత్యమేవ జయతే..’ అంటూ అద‌ర‌గొడుతున్న ప‌వ‌న్

అప్పుల్లో నాల్గో స్థానంలో ఏపీ

రెక్వెస్ట్ కాదు.. వార్నింగ్ : బండి సంజయ్

బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -