ఈవారం యూ ట్యూబ్ హిట్స్ లో లేడీస్ సినిమాలు ముందు వరుసలో ఉన్నాయి. వారు చేసిన వాంట్లో ఏవేవి ఏ స్థాయి లో ఉన్నాయి ఇపుడు తెలుసుకుందాం.
ఆమెరికన్ పాప్ స్టార్లెట్.. కేటీ పెర్రీ నటించిన ‘హె హెహె ‘ ఈవారం దుమ్ము దులిపింది. 3 ని. 45 సేపు ఆమె విశ్వరూపం చూపినందుకు ఈ వీడియోకు 7,661,489 హిట్స్ దక్కాయి.
ఓషన్స్ ట్రయాలజీకి సీక్వెల్‌గా వస్తున్న ఓషన్స్ 8 వస్తోంది. ట్రయాలజీలో మొదట వచ్చిన మూవీలోని డ్యానీ ఓషన్ అనే కల్పిత పాత్రను ఈ సీరీస్‌లో ప్రతి సినిమా టైటిల్‌లోనూ కొనసాగిస్తున్నారు. ఓషన్స్ 8 ఫస్ట్ ట్రైలర్ కు ఏకంగా 8,857,528 హిట్స్ వచ్చాయి.
రిలీజ్‌కు ఇంకా ఏడాది టైమ్ ఉండగనే, హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘మోర్టల్ ఇంజిన్’ టీజర్ విడుదలైంది! ‘లార్డ్ ఆఫ్ రింగ్స్’, ‘హాబిట్’, ‘కింగ్ కాంగ్’ చిత్రాల నిర్మాత పీటర్ జాక్సన్ తీస్తున్న మరో గ్రాండ్ ఎపిక్ ఇది. డైరెక్టర్ క్రిస్టియన్ రివర్స్. పెద్ద నగరాలు చిన్న నగరాలను తినేయడం థీమ్! ఆ తినేయడం ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఈ టీజర్‌లో చూస్తారు. మోర్టల్ ఇంజిన్స్ టీజర్ ట్రైలర్ కు 3,387,894 హిట్స్ పడ్డాయి.
రాణీ ముఖర్జీ తాజా చిత్రం హిచ్ కీ ట్రైలర్ కు ఒక కోటి 14లక్షల హిట్స్ వచ్చాయి.ఇందుల్లో ఆమె ఓ మానసిక వ్యాదితో భాదపడే టీచర్ పాత్రను పోషించింది.