Monday, April 29, 2024
- Advertisement -

యూట్యూబ్ లో అదిరిపోయే ఫీచర్స్.. ఓ లుక్కేయండి !

- Advertisement -

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ఇక స్మార్ట్ ఫోన్ లో ఎక్కువగా సోషల్ మీడియాతో కాలం గడిపేస్తూ ఉంటారు చాలమంది. వాట్సప్, ఫెస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా యాప్స్ ను యూస్ చేయడం మన డైలీ లైఫ్ లో భాగమైంది. రోజు గంటల తరబడి ఈ యాప్స్ లో సమయాన్ని గడిపేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఏదైనా సమాచార విడియోలను చూడడానికి, లేదా వీడియో కంటెంట్ అధికంగా చూడడానికి ఎక్కువ మంది యూట్యూబ్ నే ప్రిఫర్ చేస్తుంటారు. దాంతో యూట్యూబ్ లో కంటెంట్ చేసే వారికోసం ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్స్ ను తీసుకొస్తుంటుంది యూట్యూబ్. ఇక ఇటీవల మొబైల్ యూజర్స్ కు ఉపయోగపడే కొన్ని లేటెస్ట్ ఫీచర్స్ ను యూట్యూబ్ తీసుకొచ్చింది అవేంటో చూద్దాం!

యూట్యూబ్ తాజా అప్డేట్ లో యాప్ యొక్క పూర్తి ఇంటర్ఫేస్ లో చాలా మార్పులు కనిపిస్తాయి.

1.వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్
సాధారణంగా యూట్యూబ్ లో ఎవరైనా క్రియేటర్ యొక్క చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేందుకు రెడ్ కలర్ లో బటన్ కనిపించేది.. క్రియేటర్స్ కూడా రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం మనం చూసే ఉంటాం. ఇప్పుడు యూట్యూబ్ తాజా అప్డేట్ లో ఆ సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్ లో కాకుండా వైట్ కలర్ లో మనకు కనిపిస్తుంది.

2 ప్రిఫరెన్స్ వీడియో క్లిప్
గతంలో యూట్యూబ్ లో ఏదైనా వీడియో చూసే క్రమంలో ఆ వీడియోను ఫార్వర్డ్ చేయడానికి వీడియోపై లాంగ్ ప్రెస్ చేసి స్వైప్ చేసేవాళ్లం.. ఇప్పుడు తాజాగా వచ్చిన అప్డేట్ లో విడియోపై లాంగ్ ప్రెస్ చేస్తే మనకు కావలసిన పార్ట్ వరకు ఫార్వర్డ్ వెళ్ళి చూసే సౌలభ్యంఉంది. ఇది కూడా యూట్యూబ్ తీసుకొచ్చిన ఒక మంచి అప్డేట్ అనే చెప్పవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -