Monday, April 29, 2024
- Advertisement -

మైనర్ ను గర్భవతిని చేసిన టిక్ టాక్ నటుడు భార్గవ్ అరెస్ట్!

- Advertisement -

ఇటీవల కాలంలో టిక్ టాక్ యాప్ ద్వారా ఎంతోమంది ఫేమస్ అయ్యారు. ఒకదశలో ప్రపంచ వ్యాప్తంగా టిక్ టాక్ పిచ్చిలో జనాలు కొట్టుకుపోయే పరిస్థితిలో కరోనా నేపథ్యం.. చైనా నిర్వాకం వల్ల టిక్ టాక్ ని పలు దేశాలు బ్యాన్ చేశాయి. దాంతో కోట్ల మంది ఔత్సాహికులు డీలా పడిపోయారు. అయితే టిక్ టాక్ తో చాలా మంది ఫేమస్ కావడమే కాదు.. ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టారు. తాజాగా టిక్ టాక్ తో బాగా ఫేమస్ అయిన భార్గవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టు ముందు హాజరు పరిచిన భార్గవ్ కు న్యాయమూర్తి వచ్చే నెల 3వ తేదీ వరకు రిమాండ్ విధించారు.

వివరాల్లోకి వెళితే ఫన్ బాస్కెట్ పేరుతో వీడియోలు చేసే భార్గవ్ టిక్ టాక్ లో కూడా వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. టిక్ టాక్ నిషేధించడంతో మోజో, రోపోసో యాప్ లతో వీడియోలను చేస్తూ ఉన్నాడు. కొత్త వ‌ల‌స ప్రాంతానికి చెందిన భార్గ‌వ్ కు అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. టిక్ టాక్ క్రేజీతో బాలిక బార్గ‌వ్ తో క‌లిసి పలు వీడియోలు చేసింది. వీరిద్ద‌రూ అన్నా చెల్లి అని పిలుచుకోవ‌డంతో బాలిక త‌ల్లి కూడా ప‌ట్టించుకోలేదు.

అయితే ఆ బాలికపై మెజుతో భార్గవ్ పలుమార్లు అత్యాచారం చేశాడు. మాయ మాట‌లు చెప్పి గ‌ర్భ‌వ‌తిని చేశాడు. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం బాలిక నాలుగు నెల‌ల గ‌ర్భ‌వ‌తి అని గ్ర‌హించిన ఆమె త‌ల్లి పెందుర్తి పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఘ‌ట‌న పై కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు భార్గ‌వ్ ను అదుపులోకి తీసుకున్నారు.

పవన్ కళ్యాణ్‏కు కరోనా నెగిటీవ్.. ఆనందంలో అభిమానులు!

సీఎం కేసీఆర్ గారూ.. త్వరగా కరోనా నుంచి కోలుకోవాలి : పవన్ కళ్యాన్

చంద్రబాబు పై విజయసాయి సంచలన ట్విట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -