Sunday, May 12, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్‏కు కరోనా నెగిటీవ్.. ఆనందంలో అభిమానులు!

- Advertisement -

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు జనసేన టీమ్ అఫీషియల్ నోట్ రిలీజ్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆయన ఆరోగ్యం పట్ల పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు. ఇటీవల ‘వకీల్ సాబ్’ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అందులో పాల్గొన్న ఒక్కొక్కరికీ కరోనా రావడం మొదలైంది.

యూనిట్ సభ్యులతో పాటు తన భద్రత సిబ్బందిలోని కొందరికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో కొద్ది రోజుల క్రితం సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లిన పవన్ కళ్యాణ్. ఆ తర్వాత హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పవన్ కళ్యాన్ కి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయినట్టు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది జనసేన టీమ్. ఆయన తన ఫామ్ హౌజ్ లో చికిత్స తీసుకుంటున్నారు.

ఈ రోజు ఉదయం ఆయన హైదరాబాద్‌లోని ట్రినిటీ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్ష చేయించు కున్నారు. అందులో ఆయనకు రిపోర్ట్ నెగటివ్ వచ్చినట్లు తెలిసింది. దాంతో జనసేన, పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌తో పాటు.. క్రిష్‌తో ప్యాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు హరీష్ శంకర్, రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం.

సీఎం కేసీఆర్ గారూ.. త్వరగా కరోనా నుంచి కోలుకోవాలి : పవన్ కళ్యాన్

చంద్రబాబు పై విజయసాయి సంచలన ట్విట్!

తెలంగాణలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ.. హద్దు దాటితే కేసులే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -