Thursday, May 16, 2024
- Advertisement -

‘మా’ ప‌రువును బ‌జారుకీడ్చొద్దు… త‌మ్మారెడ్డి

- Advertisement -

మా లో నిథుల గోల్‌మాల్ వివిదంలో స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటీవల అమెరికాలో మా సిల్ల‌ర్ జూబ్లీవేడుక‌ల నిధుల దుర్విన‌యోగంపై మా అధ్య‌క్షుడు శివాజీ రాజ, శ్రీకాంత్ మీద ఆరోప‌న‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆరోప‌న‌ల‌పై మా అధ్య‌క్షుడు శివాజీ రాజా స్పం దించారు. తాను ఒక్క పైసా దుర్వినియోగం చేసినట్టు నిరూపిస్తే, తన ఆస్తి మొత్తాన్నీ పరిశ్రమకు రాసిచ్చేస్తానని శివాజీరాజా సవాల్ విసరడం, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని మా కార్యదర్శి, సీనియర్ నటుడు నరేశ్ డిమాండ్ చేశారు.

అయితే ఈ వివాదంపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఇద్ద‌రూ ఆలోచ‌న చేయ‌కుండా బ‌జారున ప‌డ్డార‌ని మండి ప‌డ్డారు. ఏవైనాసమ‌స్య‌లుంటే క‌ల‌సి కూర్చొని చ‌ర్చించి ప‌రిస్క‌రించుకోవాల‌న్నారు. కోపమొస్తోంది.. నవ్వొస్తోంది. నరేశ్, శివాజీ రాజా లిద్దరూ మంచి పిల్లలు. చిన్నప్పటి నుంచి వాళ్లు తెలుసు. నరేష్ చిన్నపిల్లాడుగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇద్దరికీ ఏ రకమైన స్వార్థాలు లేవు. కానీ, వీళ్లిద్దరు ఇవాళ రోడ్డున పడటం బాధగా ఉంది.. కోపంగా ఉందంట‌న త‌న‌దైన శైలిలో చుర‌క‌లు అంటించారు.

ఇప్పుడు..వాళ్లు ఇచ్చిన కోటి రూపాయలు కంటే ఎక్కువ వస్తుందా? మిగులుతుందా? అనే విషయం సంతకాలు పెట్టకముందు ఆలోచించుకుని ఉండాల్సింది. సంతకాలు పెట్టి వెళ్లి పోయాక ఆ డబ్బులు తినేశారని ఆరోపణలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉంది. మన కమిటీలో కూర్చుని మాట్లాడుకుంటే పనులు అయిపోతాయని నా ఆలోచన’ అని తమ్మారెడ్డి సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -