మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు సాధారణ ఎన్నికల కన్నా రంజుగా జరిగాయి. ఈ ఎన్నికల్లో శివాజీ రాజాచ నటుడు నరేశ్‌లు మా అధ్యక్షుడిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో శివాజీ రాజాపై నరేశ్ 68 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేసింది. అయితే ఈ ప్రమాణ స్వీకారంలో అనుహ్యా సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొత్త మా అధ్యక్షుడు నరేశ్ తన స్పీచ్‌లో ‘నా’ అనే పదాలు వాడడంపై రాజశేఖర్ అసహనం వ్యక్తం చేయగా , నటి హేమను కూడా నరేశ్ అందరి ముందు ఘోరంగా అవమానించారు.
ప్రమాణ స్వీకారంలో భాగంగా ఉపాధ్యక్షురాలుగా విజయం సాధించిన హేమ మాట్లాడుతుండగా నరేశ్ ఆమె నుంచి మైక్ లాక్కున్నారు. దీంతో అక్కడ ఉన్నవారందరు షాక్ అయ్యారు. ఈ చర్యపై హేమ మండిపడింది. రేష్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నరేష్ గారు మైక్ తీసుకోవడం బాగాలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే పక్కనే ఉన్న జీవిత, రాజశేఖర్ ఆమెకు సర్ధి చెబుతు హేమకి మైక్ అందజేశారు. మా అధ్యక్షుడు నరేశ్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఘోరంగా కామెంట్స్ చేస్తున్నారు.
- Advertisement -
నటి హేమను ఘోరంగా అవమానించిన మా అధ్యక్షుడు నరేశ్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -