Saturday, April 27, 2024
- Advertisement -

వామ్మో… అమాంతం రెమ్యునరేషన్ పెంచేసిన నయన్?

- Advertisement -

బ్యూటీ క్వీన్ నయనతార దశాబ్దకాలంగా సౌత్ ఇండియాలో అగ్రహీరోయిన్ గా కొనసాగుతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీల్లో నటించి సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోయిన్ గా రికార్డును సొంతం చేసుకుంది.అలాగే నయనతార అరం,డోరా,కోలమావు కోకిల, ఐరా,వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందింది.

గ్లామర్ బ్యూటీ నయనతార ఇప్పటివరకు దక్షిణాది సినిమాలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో నయనతార హీరోయిన్ గా అవకాశం దక్కించుకుని గ్రాండ్ గా బాలీవుడ్లో అడుగు పెట్టబోతోంది. అట్లీ కుమార్ దర్శకత్వంలో ఇప్పటికే నయనతార రాజ రాణి, బిగిల్‌, వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది.

Also read:బాలీవుడ్ నటితో రోహిత్ ప్రేమాయణం… మధ్యలో కోహ్లీ వచ్చి?

తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్లో నటించబోయే సినిమాకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. నయనతార బాలీవుడ్‌ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు7-8 కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్‌ చేసిందట.పైగా ఈమూవీ దక్షిణాదిలో కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది .కాబట్టి దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ అయినా నయనతారకు భారీ మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమయ్యారనీ తెలుస్తోంది .

Also read:ఆచార్య హీరోయిన్ కాజల్ అంత సంపాదించిందా.. వామ్మో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -