ఆచార్య నుంచి మరో సర్ప్రైస్.. ఈసారి చెర్రీ వంతు?

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా స్టార్ తన 153 వ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు టీజర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి.

ఆచార్య సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా బుట్టబొమ్మ జతకట్టింది. ఇప్పటివరకు మెగాస్టార్ కాజల్ కాంబినేషన్లో విడుదలైన  ‘లాహే లాహే’పాట మంచి ఆదరణ దక్కించుకుంది. అయితే ఈ సినిమా నుంచి మరొక సర్ ప్రైజ్ ను ఇవ్వడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Also read:సరికొత్త పాత్రలో సాయి పల్లవి స్పెషల్ వీడియో..?

తాజాగా ఈ సినిమాకు సంబంధించి చెర్రీ, పూజా హెగ్డే మధ్య సాగే ఒక రొమాంటిక్ పాటను చిత్రీకరించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జులై నెలలో ఈ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ‘లాహే లాహే’పాట మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఇప్పుడు మెగా అభిమానుల దృష్టి మొత్తం చెర్రీ పాట పై ఉంది.

Also read:కర్మ అంటూ కత్తి మహేష్ యాక్సిడెంట్ పై పూనమ్ కౌంటర్లు?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -