Saturday, April 20, 2024
- Advertisement -

కరోనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేయాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

- Advertisement -

ప్రస్తుతం మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వాక్సినేషన్ అందిస్తున్నారు. అయితే మనం వేసుకునే ఏ వ్యాక్సిన్ అయినా కూడా సమర్థవంతంగా పనిచేయాలంటే మన శరీరంలో తప్పనిసరిగా రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.అందుకోసమే మన శరీరంలో రోగనిరోధక శక్తిని ఏ విధంగా పెంపొందించుకోవాలి నిపుణులు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ తీసుకునే కొన్ని రోజుల ముందు, తరువాత మద్యపానానికి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ ప్రభావం మన లివర్ పై పడటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి పోతుంది. కనుక మద్యానికి దూరంగా ఉండటం ఉత్తమం. అదేవిధంగా మనం అధిక మానసిక ఒత్తిడికి గురి కావడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గుతుంది అందుకే వాక్సిన్ వేయించుకున్న తరువాత ఎలాంటి మానసిక ఆందోళన ఒత్తిడి లేకుండా ప్రశాంతతను కలిగి ఉండాలి.

Also read:కర్మ అంటూ కత్తి మహేష్ యాక్సిడెంట్ పై పూనమ్ కౌంటర్లు?

వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత మనం ఆరోగ్యంపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత ఎంతో సమతుల్యమైన పోషకాహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో ఉత్తమం. అదేవిధంగా వేలకు నిద్రపోవటం సరైన శరీర వ్యాయామాలను చేయటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. తద్వారా మనం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నా అది ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Also read:బాలీవుడ్ నటితో రోహిత్ ప్రేమాయణం… మధ్యలో కోహ్లీ వచ్చి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -