Tuesday, April 30, 2024
- Advertisement -

షారుక్ ఖాన్ తో రొమాన్స్ చేయనున్న నయనతార..?

- Advertisement -

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది అన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోని వీరి కాంబోలో తెరకెక్కే సినిమాకు “సంకి” అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతోందని గత ఏడాది కాలం నుంచి వార్తలు వస్తున్నాయి.

తాజాగా వీరిద్దరి కాంబోలో రాబోయే ఈ సినిమాకు సంబంధించిన ఓ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.షారుక్ అండ్ ఆట్లీ టీం ఫీమేల్ లీడ్ రోల్ కోసం న‌య‌న‌తారను సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ పాత్రలో చేయడానికి నయన్ ఒప్పుకున్నారా ..లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Also read:అయేషా సుల్తానాను వదిలేసినా పోలీసులు..?

షారుక్ – అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షారుక్‌ఖాన్‌-క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించగా , ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. షారుక్ ప్రస్తుతం సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ష‌న్ ప‌ఠాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో షారుక్ సరసన దీపిక జోడి కట్టారు. కరోనా కారణం వల్ల వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తాజాగా ముంబైలోని య‌శ్ రాజ్ ఫిలిమ్స్ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ సినిమా పూర్తి కాగానే షారుక్ అట్లీ దర్శకత్వంలో చేయనున్నారని వార్తలు వినబడుతున్నాయి.

Also read:త్వరలోనే శివతో సూర్య సినిమా.. ఎప్పుడొస్తుందంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -