Saturday, April 20, 2024
- Advertisement -

చిట్టిబాబు ను పుష్ప‌రాజ్ మైమ‌రిపిస్తాడా..!

- Advertisement -

అల్లు అర్జున్ సుకుమార్ కాంబో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నా పుష్ప సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీంతో మూడో సినిమాపై సహజంగానే అంచనాలు ఉంటాయి.. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ తరువాత నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో జరుగునుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈసినిమాని మైత్రీ మూవీమేకర్స్ అందిస్తుంది. 2021 లో రిలీజ్ కు సన్నాహాలు చెస్తున్నారు.

డైరెక్ట‌ర్ సుకుమార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా 1980ల నేపథ్యంలో తెరకెక్కించిన రంగ‌స్థ‌లం ఎంత పెద్ద హిట్ అందుకుందో అందరికి తేలిసిందే. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ను చిట్టిబాబుగా తీర్చిదిద్ది ప్రసంశలు అందుకున్నాడు ఈ క్రియేటివ్ మాస్ట‌ర్ మైండ్ డైరెక్ట‌ర్ సుకుమార్. డైరెక్ట‌ర్ సుకుమార్ దర్శకత్వంలో పెద్ద హిట్ అందుకున్న రంగస్థ‌లం సినిమా తరువాత వస్తున్న సినిమా పుష్ప్.. కాబట్టి దీనిపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి.

పుష్ప సినిమా కూడా 1980 బ్యాక్‌డ్రాఫ్ పైనే తెర‌కెక్కిస్తున్నాడు సుకుమార్. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‍ను ఓ ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్‌ పుష్ప‌రాజ్ గా ఎలా తీర్చిదిద్దితాడో అనేదే ఇప్పుడు ఇండస్ట్రీ లో గుసగులు మొదలైయాయి. రామ్ చ‌ర‌ణ్ చిట్టిబాబు పాత్రను అల్లు అర్జున్‍ పుష్ప‌రాజ్ పాత్రతో మెప్పిస్థాడా… సుకుమార్ పుష్ప‌రాజ్ పాత్రను ఎలా తీర్చిదిద్దాడో అనేదే ఇప్పుడు హాట్ టాపిక్.

గుండె కోసం ఈ పది సూపర్ ఫుడ్స్

మన తెలుగు హీరోయిన్స్ సొంత ఊరు ఎక్కడో తెలుసా ?

మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?

మన దర్శకుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -